• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణా కాంగ్రెస్ కు షాక్ .. ఆ ఇద్దరు ఎంపీలు జంప్ అవుతారా ? రాం మాధవ్ ను అందుకే కలిశారా ?

|

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒకపక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించి పార్టీకి తీరని నష్టం చేస్తుంటే, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి సైతం తెలంగాణ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. అందులో భాగంగా ఇటీవల గెలిచిన ఎంపీల్లో ఇద్దరు ఎంపీలు బిజెపికి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగుతుంది.

మా గురించి మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తాం... టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  భారతదేశంలో 2047 వరకు బీజేపీదే అధికారం.. -రామ్ మాధవ్
  తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ .. ఇతర పార్టీల ముఖ్య నేతలకు గాలం

  తెలంగాణాపై ఫోకస్ పెట్టిన బీజేపీ .. ఇతర పార్టీల ముఖ్య నేతలకు గాలం

  ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సొంతం చేసుకొని పట్టు సాధించింది. ఇక దీంతో తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించింది బిజెపి అగ్రనాయకత్వం. అందులో భాగంగా బిజెపి అగ్రనేత రామ్ మాధవ్ ను రంగంలోకి దించింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది .ఇక టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నాలు ప్రారంభించిన బీజేపీ, కాంగ్రెస్, టిడిపి పార్టీ లోని ముఖ్య నేతలకు గాలం వేస్తోంది.

  రామ్ మాధవ్ ను కలిసిన రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట రెడ్డి .. ఇద్దరు ఎంపీలు జంపేనా ?

  రామ్ మాధవ్ ను కలిసిన రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట రెడ్డి .. ఇద్దరు ఎంపీలు జంపేనా ?

  రానున్న ఐదేళ్ళలో తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. అందుకే రాం మాధవ్ తెలంగాణాపై పూర్తిగా దృష్టి సారించారు. ఇక దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అని మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న పరిస్థితులతో పార్టీని వీడాలని ఇప్పటికే చాలా మంది నాయకులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కెసిఆర్ అన్న కూతురు రమ్యా రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారని సమాచారం. ఇక ఈ వార్తలను వారు ఖండిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో, వారు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

  ఇద్దరు ఎంపీలు జంప్ అయితే తెలంగాణా కాంగ్రెస్ కు గట్టి దెబ్బ

  ఇద్దరు ఎంపీలు జంప్ అయితే తెలంగాణా కాంగ్రెస్ కు గట్టి దెబ్బ

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడంతోనే వారు బిజెపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారనివార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారు. ఇక తాజాగా గెలిచిన ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎంపీలు బిజెపి బాట పడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలినట్లుగా అవుతుంది. మరి ఇంత ప్రచారం జరుగుతున్న ఆ ఎంపీలు పార్టీ మారి బీజేపీ లోకి జంప్ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In the next five years, the BJP leaders have been tasked to change the BJP as an alternate political force in Telangana. That's why Ram Madhav is entirely focused on Telangana. Apart from the party in power in the country, many leaders have already decided to leave the party with the situations inside the Congress party. There is a propaganda campaign that two MPs from the Telangana Congress are ready to join the BJP. Congress Working President Revanth Reddy and Komatireddy Venkat Reddy met BJP general secretary Ram Madhav . Komatireddy Rajagopal Reddy, KCR's niece Ramya Rao and former MP Vivek were also met ram madhav . But as the Congress party has become obsolete, they seem to be looking alternately to the BJP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more