వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు, గుత్తాకు ఝలక్: కాంగ్రెస్ పార్టీలోకి వలస, 'తెరాసకు కౌంట్ డౌన్'

జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో దామరచర్ల జడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెరాసలోకి టిడిపి, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. అయితే, దామరచర్లలో తెరాసకు షాక్ తగిలింది.

కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత, సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో దామరచర్ల జడ్పీటీసీ సభ్యుడు శంకర్ నాయక్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?'రాజకీయ కక్ష, చిరుకు అవమానం': 150వ సినిమాకు బాబు అనుమతివ్వడం లేదా?

ఆరు నెలల క్రితం వీరంతా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంట తెరాసలో చేరారు. నాడు తెరాసలో చేరిన వారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. వీరి చేరికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

 Shock to TRS: ZPTC join Congress in the presence of Jana Reddy and UTtam

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు మాట్లాడారు. తెరాస ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఉత్తమ్ అన్నారు. 2019లో కాంగ్రెస్‌కు పట్టం కడితేనే అందరు కోరుకున్న తెలంగాణ వస్తుందన్నారు.

పెద్ద నోట్ల రద్దు ప్రధాని నరేంద్ర మోడీ అనాలోచిత నిర్ణయమన్నారు. నోట్ల రద్దు వికార వికృత ప్రక్రియగా కొనసాగుతోందన్నారు. బంగారు తెలంగాణ కాదని, భ్రష్టు పట్టిన తెలంగాణగా మారిందని, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా జన్మిస్తానని సీఎల్పీ జానారెడ్డి అన్నారు.

English summary
ZPTC join Congress in the presence of Jana Reddy and UTtam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X