వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వైద్యురాలికి నరకం చూపించారు: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు: సాయం కోసం ఆక్రందన..అయినా ..!

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శంషాబాద్ వైద్యురాలు అత్యాచారం..హత్య విషయంలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. నలుగురి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించటంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో ఎవరూ తట్టుకోలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురు తోడేళ్లలా ఆ యువతి మీద పడ్డారు. ఆ సమయంలో ఆ వైద్యురాలి సాయం కోసం చేసిన ఆక్రందన ఎవరి చెవులకూ చేరలేదు. బలవంతంగా నోట్లో మద్యం పోసి..అరవకుండి నోరు మూసేసారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మాకర స్థితికి చేరుకున్న అమెను నోరు..ముక్కు మూసేసి చంపేసారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేయటంతో పాటుగా ఆమె ఫోన్‌ సిమ్‌ కార్డులూ మంటల్లోకే వేసారు. ఆ రిమాండ్ రిపోర్టులో విషయాలను ఒక ప్రముఖ దిన పత్రిక ప్రచురించింది. ఆ కధనం మేరకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

ఆ నలుగురి ప్రత్యక్ష నరకం చూపించారు..

ఆ నలుగురి ప్రత్యక్ష నరకం చూపించారు..

శంషాబాద్ కు చెందిన ఆ వెటర్నరీ వైద్యురాలి అత్యాచారం..హత్య ఘటన పైన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు కనిపించాయి. ఇదే సమయంలో ఇదే కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక విషయాలు ..విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వచ్చాయి. డ్రైవర్లు మహ్మద్‌ అరీఫ్‌, చెన్నకేశవులు, క్లీనర్లు నవీన్‌, శివలు కలిసి ఆమెను అత్యాచారం చేసి, చంపినట్లు రిమాండ్‌ రిపోర్టులో తేలింది. బైకును పంచర్‌ వేయించే పేరుతో శివను బైకుతో పదేపదే బయటకు పంపిస్తూ కాలయాపన చేసి ఆమెను ఎక్కువసేపు అక్కడే ఉండేట్లు చేసి మాట్లాడారు. చివరకు శివ బైకుకు గాలి కొట్టించుకొని వచ్చిన తర్వాత ఆమె వెళ్లడానికి సిద్ధం అవగానే ఒక్కసారిగా అందరూ తోడేళ్లలా ఆ వైద్యురాలిపై పడ్డారు. మొదట అరీఫ్‌ ఆమె చేతులు పట్టుకోగా, చెన్నకేశవులు కాళ్లు పట్టుకున్నాడు. నవీన్‌ ఆమె ఫోన్‌ లాక్కుని స్విచాఫ్‌ చేశాడు. ముగ్గురూ కలిసి బలవంతంగా ఆమెను గోడచాటుకు లాక్కెళ్లారు. ఆమె హెల్ప్‌ హెల్ప్‌ అని అరుస్తున్న సమయంలో నవీన్‌, చెన్నకేశవులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసి, నోరు తెరవకుండా పట్టుకున్నారు.

ఒకరి తర్వాత ఒకరు..

ఒకరి తర్వాత ఒకరు..

నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు మొదట అత్యాచారం చేశాడు. తర్వాత నవీన్‌, అరీఫ్‌, శివ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కొంతసేపటికి ఆమె స్పృహలోకి రావడంతో.. అది తమకు ప్రమాదమని అరీఫ్‌ భావించాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకొని.. తలను అదిమి పట్టి తుది శ్వాస విడిచే వరకు ముక్కు, నోరు మూశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేశారు. సంఘటన స్థలంలో ఆమె ఆనవాళ్లేమీ లేకుండా చేయడం కోసం పర్సు, క్రెడిట్‌ కార్డు, ఐడీకార్డు, ఫోన్‌ అన్నీ హ్యాండ్‌ బ్యాగులో వేసి లారీలో పెట్టారు. దుప్పట్లో చుట్టిన యువతి మృతదేహాన్ని శివ, నవీన్‌, చెన్నకేశవులు కలిసి లారీ కేబిన్లోకి ఎక్కించారు. పక్కన ఆగిన కంటైనర్‌ నుంచి రెండు క్యాన్ల డీజిల్‌ తస్కరించారు. అనంతరం అరీఫ్‌ తమ లారీని శంషాబాద్‌ వైపు తీసుకెళ్లాడు. అతనితోపాటు చెన్నకేశవులు కేబిన్లో కూర్చున్నాడు.

ఆర్టీయేకు చిక్కిన లారీ..అయినా..

ఆర్టీయేకు చిక్కిన లారీ..అయినా..

శివ, నవీన్‌లను బైకు మీద వెళ్లి.. పెట్రోల్‌ కొనమని చెప్పారు. శంషాబాద్‌ వద్ద లారీ యూటర్న్‌ తీసుకొని బెంగళూరు వైపు బయలుదేరింది. చటాన్‌పల్లి దగ్గర లారీ యూటర్న్‌ తీసుకొని, హైదరాబాద్‌ వైపు తిరిగి.. దగ్గర్లోని అండర్‌ పాస్‌ దగ్గర లారీ ఆపారు. మృతదేహాన్ని కిందకు దింపి, డీజిల్‌, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆమె ఫోన్‌ సిమ్‌కార్డును మంటల్లో వేశారు. అక్కడి నుంచి బయల్దేరి నాలుగు గంటలకు ఆరాంఘర్‌ చేరుకున్నారు. లోడ్‌ దింపేసి, ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోయారు. అంతకు ముందు..మహ్మద్‌ అరీఫ్‌, శివ కలిసి కర్ణాటకలోని గంగావతి నుంచి ఇటుక లోడుతో హైదరాబాద్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో స్నేహితులు నవీన్‌, చెన్నకేశవులు వారికి తోడయ్యారు. తస్కరించిన ఇనుమును అందులో ఎక్కించారు. లారీ మహబూబ్‌నగర్‌ రాగానే ఆర్టీయే అధికారులు పట్టుకున్నారు. అరి్‌ఫకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, అధిక లోడు ఉండటంతో లారీని సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని అరీఫ్‌ తన యజమాని శ్రీనివాసరెడ్డికి ఫోన్లో చెప్పాడు. ఆర్టీయే వాళ్లు లారీని తీసుకెళ్లకుండా చూడాలని, అందుకోసం లారీ సెల్ఫ్‌ మోటర్‌ రోప్‌ను లూజ్‌ చేయాలని చెప్పాడు.

ఆ నాలుగు వేలతో జల్సా..దారుణం

ఆ నాలుగు వేలతో జల్సా..దారుణం

ఆర్టీయే సిబ్బంది లారీని తరలించబోగా అది మొరాయించింది. దీంతో వాళ్లు లారీని వదిలేసి ముందుకు వెళ్లిపోయారు. ఆర్టీయే వాళ్లు వెళ్లగానే నలుగురూ లారీని తీసుకొని హైదరాబాద్‌ బయలుదేరారు. మధ్యలో ఇనుమును తుక్కు వ్యాపారి వద్ద అమ్మేశారు. దాంతో వారికి నాలుగు వేల రూపాయలు వచ్చాయి. ఆ సొమ్ముతో జల్సాలు మొదలెట్టారు. లారీని తీసుకొని నేరుగా తొండుపల్లి వద్దకు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు పక్కన ఆపి పడుకున్నారు. మర్నాడు ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దాంతో కాస్త ముందుకు వెళ్లి.. తొండుపల్లి టోల్‌ గేటు పక్కన ఖాళీ స్థలంలోకి వచ్చి లారీని ఆపారు. సాయంత్రం ఐదు గంటలకు శివ 4 వేలతో మందు పార్టీ చేసుకుందామని ఒత్తిడి చేశాడు. దీంతో.. మద్యం కొనుక్కొని వచ్చి తాగడం మొదలెట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆ వైద్యురాలు వచ్చి లారీ పక్కనే బైకును పార్క్‌ చేసింది. టోల్‌ గేట్‌ దగ్గర క్యాబ్‌ ఎక్కి గచ్చిబౌలీ వైపు వెళ్లిపోయింది. ఇది చూసిన నలుగురూ.. ఆమె చాలా అందంగా ఉందని, ఎలాగైనా అనుభవించాలని అనుకున్నారు. ఇందుకోసం పక్కా వ్యూహం రచించారు. వారు అనుకున్నట్లే రాత్రి 9 గంటల సమయంలో ఆమె తిరిగి వచ్చిన వైద్యురాలు..ఆ తేడేళ్ల చేతికి చిక్కింది. బలైంది.

English summary
Remand report of Veteranary doctor rape and murder case revieled facts behind this case. In this report shocking elements came out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X