• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లి రేప్.. ప్రియుడే హంతకుడు.. తంగడపల్లి కేసులో విస్తుపోయే నిజాలు..

|

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద గత నెల 17న ఓ వివాహిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే పథకం ప్రకారం ఆమెను ప్రియుడే హత్య చేసినట్టు సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. మరో స్నేహితుడితో కలిసి ఆమెను లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లిన ప్రియుడు.. మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు విచారణలో తేలింది.

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మృతురాలికి వివాహమైంది. అయితే పెళ్లికి ముందు ఓ యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె.. పెళ్లి తర్వాత కూడా అతనితో సన్నిహితంగానే ఉంటూ వచ్చింది. ఇదే క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని.. ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుదామని అతనిపై ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే వేరే అమ్మాయికి దగ్గరైన ఆ యువకుడు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తరుచూ పెళ్లి గురించి ఒత్తిడి చేస్తూనే ఉంది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ప్రియుడే హత్యకు పథకం రచించాడు.

లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..

లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి..

లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామంటూ ఆమెను పిలిచిన ప్రియుడు.. అద్దె కారులో ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. మరో స్నేహితుడిని కూడా వెంట తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక కారును ఒక ప్రదేశంలో ఆపి ఆమెపై ఇద్దరూ అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అనంతరం తంగడపల్లి వంతెన వద్దకు చేరుకుని మృతదేహంపై ఉన్న దుస్తులు తొలగించారు. ఆపై మృతదేహాన్ని వంతెన కిందకు తీసుకెళ్లి ముఖంపై బండరాయితో మోదారు. గంట పాటు అక్కడే ఉండి.. ఆ బండరాయిని కూడా తమతో తీసుకుని వెళ్లిపోయారు.

  Lok Sabha Elections 2019 : తెలంగాణలో ఆ నాలుగు స్థానాల్లో జోరుగా బెట్టింగ్ || Oneindia Telugu
  జీపీఎస్‌తో నిందితుల గుర్తింపు

  జీపీఎస్‌తో నిందితుల గుర్తింపు

  నిందితులు అద్దెకు తీసుకున్న కారు జీపీఎస్‌ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. దాని ఆధారంగా నిందితులు తంగడపల్లి నుంచి నుంచి ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరినట్టు గుర్తించారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో ఓ నిందితుడు పట్టడంతో కేసు మిస్టరీ వీడిపోయింది. అయితే పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దొరికితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

  English summary
  Tangadapalli woman murder mystery chased by the police . the deceased was form sikkim and killed by her lover. Even though she is married she forced her lover to marry her but he refused for that.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more