• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: డ్రగ్స్, గంజాయి చాట్స్ కోసం హైదరాబాద్ పోలీసుల తనిఖీలు .. వీడియో వైరల్; భగ్గుమన్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా డ్రగ్స్ పై ఆందోళన కొనసాగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని పోలీసులు రోడ్లపై ప్రయాణికులను ఆపి వారి మొబైల్ ఫోన్స్ లో డ్రగ్స్ చాట్ లు వెతకడానికి తనిఖీలు చేస్తున్నట్లుగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పోలీసుల మొబైల్ ఫోన్ తనిఖీలు .. డ్రగ్స్ , గంజాయి చాట్స్ కోసం .. వీడియో వైరల్

పోలీసుల మొబైల్ ఫోన్ తనిఖీలు .. డ్రగ్స్ , గంజాయి చాట్స్ కోసం .. వీడియో వైరల్


హైదరాబాద్లోని పోలీస్ సిబ్బంది పాతబస్తీలో వాహనాలను, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను ఆపి వారి ఫోన్లను తనిఖీ చేశారని, వారి చాట్ లలో డ్రగ్స్ గురించి వెతకడం ద్వారా గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా , వాట్సప్ గ్రూప్ ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకే మొబైల్ ఫోన్లలో వాట్సప్ చాట్ ల తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వాహనదారులను ఆపి అందులో గంజాయి అని టైప్ చేసి సెర్చ్ కొట్టమని చెప్పి మరీ తనిఖీలు చేస్తున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా పోలీసులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొబైల్ ఫోన్లను తనిఖీ చెయ్యటం అంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటం , ఇది చట్ట ఉల్లంఘన అంటూ పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బహదూర్‌పురా పోలీసుల వాహన తనిఖీలు.. డ్రగ్స్, గంజాయిపై స్పెషల్ డ్రైవ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చిన సౌత్ జోన్ డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌పురా పోలీసుల పరిధిలోని అసద్‌బాబా నగర్ ప్రాంతంలో 100 మందికి పైగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. డ్రైవ్ సందర్భంగా 58 వాహనాలను సోదా చేశారు. 10 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు . నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారని వెల్లడించారు. ఇదే సమయంలో గత రెండు నెలలుగా హైదరాబాద్‌ కమిషనరేట్‌లో డ్రగ్స్‌, గంజాయిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, అక్రమార్కులను వదిలిపెట్టబోమని డీసీపీ తెలిపారు.

పోలీసులు వాహనాలు ఆపి మొబైల్స్ తనిఖీ చేస్తున్న వీడియో పోస్ట్

పోలీసులు వాహనాలు ఆపి మొబైల్స్ తనిఖీ చేస్తున్న వీడియో పోస్ట్

ఇక పోలీసులు వాహనదారులను ఆపి వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి కొత్త పోలీసింగ్ ప్రాక్టీస్ పై ప్రజలకు హెచ్చరిక అంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులు వాహనాలను ఆపి ఫోన్ చాట్‌లను తనిఖీ చేస్తున్నారంటూ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి పదాల కోసం పోలీసులు ఫోన్ చాట్‌లను వెతుకుతున్నారని తెలిపారు. ఇక పోలీసుల తనిఖీలు నేపథ్యంలో వారు డ్రగ్స్ చాట్ లకు ఉపయోగించే పదాలను ఎన్‌ఆర్‌సి, మోడీ లేదా బిజెపితో భర్తీ చేసే వరకు వేచి ఉండాలంటూ సెటైర్ వేశారు.

 పోలీసుల తనిఖీలపై నెటిజన్లు ఫైర్

పోలీసుల తనిఖీలపై నెటిజన్లు ఫైర్

ఇక పోలీసుల తనిఖీలపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఇది సామాన్య ప్రజలకు వేధింపు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గంజాయి సంగ్లింగ్ చేస్తే లేదా వాడితే దాని కోసం అందరినీ ఆపి మొబైల్స్ తనిఖీ చెయ్యటం దారుణం అని మండిపడుతున్నారు. ఇక బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి, ఆర్థిక మోసాలు చేసిన వారిని పట్టుకోవడం కోసం కరెన్సీ నోట్లు, క్రెడిట్ కార్డులను తనిఖీ చేస్తారా ముందు ముందు అంటూ ప్రశ్నిస్తున్నారు.

గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపమన్న సీఎం కేసీఆర్

గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపమన్న సీఎం కేసీఆర్


ఇదిలా ఉంటే ఇటీవల గంజాయి సాగుపై, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని నివేదికలు వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ఇటీవల సీఎం కేసీఆర్ అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, గంజాయి సాగును నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, గంజాయితో పాటు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయికి అడ్డుకట్ట వెయ్యాలన్న సీఎం

ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయికి అడ్డుకట్ట వెయ్యాలన్న సీఎం


తెలంగాణా రాష్ట్రంలో గంజాయి వంటి మాదక ద్రవ్య లభ్యత పెరగడం శోచనీయమని పేర్కొన్న సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న వేళ ఇలాంటి ఉపద్రవాల వల్ల సాధించిన విజయాల ఫలితాలు నిర్వీర్యమై పోతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తుందని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా గంజాయిని అరికట్టడం కోసం రాజీలేని పోరాటం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గడ్ ల నుండి గంజాయి వస్తుందని అధికారులు చెప్పగా దానికి అడ్డుకట్ట వెయ్యాలని, తనిఖీలను పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం ఆదేశాలతోనే సోదాలు చేస్తున్నారని ప్రజల అసహనం .. పోలీసుల తీరుపై ఫైర్

సీఎం ఆదేశాలతోనే సోదాలు చేస్తున్నారని ప్రజల అసహనం .. పోలీసుల తీరుపై ఫైర్


ఇటీవల గంజాయిని కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు వాహనదారులను ఆపి గంజాయి, డ్రగ్స్ చాటింగ్ లు ఏమైనా ఉన్నాయా అన్నది తనిఖీ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఇది సరైన పద్ధతి కాదని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
The video of Hyderabad police checking for drugs and ganja chats has gone viral. Information that the police are conducting a special drive in order to eradicate marijuana and drugs. Netizens fire over this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X