వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు షాకింగ్ న్యూస్... ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు రెండు రోజులు బంద్

|
Google Oneindia TeluguNews

ఎన్నికల పండుగ రాబోతోంది. మరికొన్ని గంటలే సమయం వుంది. నగదు , మందుతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు తమవైపుకు ఓటర్లను మరల్చే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎన్నికల సంఘం ఎన్నికల ముందు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలపై నిఘా పెంచింది. ఈసీ ఆదేశాలను పాటిస్తూ మద్యం షాపులను బంద్ చేయించనుంది .

ఎన్నికల పండుగకు ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఈసీ నిర్ణయం .. మద్యం దుకాణాలు బంద్

ఎన్నికల పండుగకు ఓటర్లను ప్రలోభపెట్టకుండా ఈసీ నిర్ణయం .. మద్యం దుకాణాలు బంద్

ఎప్పుడైనా ఎన్నికల సమయంలో కీలక భూమిక పోషించేది ఒకటి నగదు , రెండు మద్యం .. నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి ఈ రెండు ఆయుధాలను వాడతారు. డబ్బిచ్చి, మద్యం తాగించి తమ పార్టీకే ఓటెయ్యమని ప్రలోభపెడతారు. ఇక అలా ప్రలోభపెట్టకుండా ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో మంగళవారం ఏప్రిల్ 9 అంటే నేడు సాయంత్రం 6 నుంచి ఏప్రిల్ 11 ,గురువారం పోలింగ్ రోజు సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు.

ఈసీ ఆదేశాలను అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు .. జైలు శిక్ష తప్పదు

ఈసీ ఆదేశాలను అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు .. జైలు శిక్ష తప్పదు

వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మాత్ర కాదు పబ్బులు, క్లబ్బులు, వంటివి అన్నే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంటే మద్యం అమ్మకాలు జరిపే ఏ హోటళ్లకు అయినా ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అతిక్రమిస్తే వారి లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ , పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అలాగే బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో మందు బాబులకు షాక్ తగిలినట్టయ్యింది.

ఏబీపై మరోసారి ఎన్నికల అధికారికి ఫిర్యాదుఏబీపై మరోసారి ఎన్నికల అధికారికి ఫిర్యాదు

మద్యం షాపుల బంద్ ఎఫెక్ట్ .. విపరీతంగా మద్యం కొనుగోళ్ళు .. బ్లాక్ దందా చేస్తున్న వ్యాపారులు

మద్యం షాపుల బంద్ ఎఫెక్ట్ .. విపరీతంగా మద్యం కొనుగోళ్ళు .. బ్లాక్ దందా చేస్తున్న వ్యాపారులు

రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చెయ్యనున్న నేపధ్యంలో ప్రస్తుతం మద్యం షాపుల నుండి మద్యం విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికీ రాజకీయ నాయకులు మద్యం తో ఓటర్లను ప్రలోభపెట్టటానికి ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఇదే సమయం అని భావించి మద్యం వ్యాపారులు సైతం సందట్లో సడేమియా అంటూ బ్లాక్ దందాకు తెరలేపారు. మొత్తానికి ఈసీ మద్యం, నగదు ఎంత కట్టడి చెయ్యాలని చూసినా అధికారుల కళ్లుగప్పి జరిగే దందా జరుగుతూనే ఉంటుంది. కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపధ్యంలో అయినా ఈ మద్యం వరద తగ్గుతుందో లేదో వేచి చూడాలి .

English summary
Telangana state EC shocked the drunkards during the election polling . All the outlets selling and serving alcohol including, wine shops, bars, restaurants, pubs and Canteen Stores Department will be closed for 48 hours ahead polls secluded on April 11th . The shops will be closed from April 9th (6pm ) to April 11th (6pm)," a statement issued by the state election authority .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X