వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేయూ పరీక్షా పత్రాలలో కేసీఆర్ , టీఆర్ఎస్ లపై షాకింగ్ ప్రశ్నలు .. అవాక్కైన విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

కాకతీయ యూనివర్సిటీ ఎస్ డి ఎల్ సి ఈ పరీక్షలలో టిఆర్ఎస్ పార్టీపై, కెసిఆర్ పై ఇచ్చిన ప్రశ్నలు విద్యార్థులను షాక్ కు గురిచేశాయి. సిలబస్ తో సంబంధం లేకుండా ఇచ్చిన ప్రశ్నలను చూసి పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అవాక్కయ్యారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి కారణాలు ఏమిటి ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమిటి ? వంటి ప్రశ్నలను ఇవ్వడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరికబీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిక

ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలపై తీవ్ర విమర్శలు

ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలపై తీవ్ర విమర్శలు

కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎం పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ పేపర్ లో గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సబ్జెక్టు ఉంది. అయితే ప్రశ్నపత్రంపై మాత్రం గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ అనే సబ్జెక్ట్ ను ఇచ్చారని విద్యార్థులు చెబుతున్నారు.

 సిలబస్ ఏపీ గురించి .. ప్రశ్నలు తెలంగాణా, కేసీఆర్ గురించి

సిలబస్ ఏపీ గురించి .. ప్రశ్నలు తెలంగాణా, కేసీఆర్ గురించి

రాష్ట్ర రాజకీయాల అధ్యయన దృక్పథాలు, రాష్ట్ర రాజకీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర ఉద్యమం, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, గవర్నర్ వ్యవస్థ విశ్లేషణ, మంత్రిమండలి ముఖ్యమంత్రి, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ లో రైతు ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాజకీయ పరిణామాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం విధులు వంటి అంశాలపై సిలబస్ ఉండగా, సిలబస్ కు భిన్నంగా తెలంగాణ రాజకీయాల నుండి ప్రశ్నలు వేశారు.

 సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చారన్న విద్యార్థులు

సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చారన్న విద్యార్థులు

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటి? ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కారణాలేంటి ? 1969 నాటి ఉద్యమం బలహీనపడ్డాయి కారణాలేంటి? తెలంగాణలో కిందిస్థాయి పాలనలో చేపట్టిన సంస్కరణలు ఏంటి ? వంటి అసంబద్ధమైన ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు లబోదిబోమన్నారు. అంతేకాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు క్షీణించిన కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇలా సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వటమే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ కు సంబంధించి ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు షాక్ అయ్యారు.

ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలపై అభ్యంతరం .. మండిపడుతున్న ప్రతిపక్ష నాయకులు

ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలపై అభ్యంతరం .. మండిపడుతున్న ప్రతిపక్ష నాయకులు

దీనిపై ఇతర పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇదంతా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థుల పరీక్ష పత్రాలలో ఈ తరహా ప్రశ్నలు అడగడం కేవలం టిఆర్ఎస్ పార్టీకి మేలు చేయడానికి అని విమర్శిస్తున్నారు. అధ్యాపకులు సిలబస్లో లేని ప్రశ్నలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.


అభిమానం ఉంటే పరీక్షలలో ప్రశ్నలే వారి గురించి ఇస్తారా అని మండిపడుతున్నారు.

English summary
Kakatiya University SDLCE questions asked on the TRS party and KCR in these exams shocked the students. Students who came to write the tests were shocked by the questions given regardless of the syllabus. What are the reasons for the success of the TRS party in the elections? What is the role of KCR in the formation of Telangana state? The students were stunned by being asked such questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X