• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్ రిజల్ట్స్... ఆ యూనివర్సిటీలో 105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్

|

రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగున్నర ఏళ్లకుపైగా కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. ఇక బోధన సైతం అంతంత మాత్రమే అని చెప్పడానికి ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ ఫస్టియర్ ఫలితాలే ఒక తార్కాణం.

105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్

105 మంది విద్యార్థుల్లో ఒక్కరే పాస్

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. పేరుకు యూనివర్సిటీ గా ఉన్న యూనివర్సిటీ లో ఉండాల్సిన వసతులు కానీ, పరిపాలనా వనరులు కానీ, సిబ్బంది కానీ ఇక్కడ లేరు. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మెడికల్ పీజీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 105 మంది పీజీ విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా వెలువరించిన ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ అయినట్లుగా ఫలితాలు చేయడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. తాము పరీక్షలు బాగా రాశాము అని చెబుతున్న విద్యార్థులు పరీక్షల విభాగం ప్రకటించిన ఫలితాలను చూసి ఆవేదనకు గురయ్యారు.

పీజీ పరీక్షా ఫలితాలపై విద్యార్థులు మౌన నిరసన

పీజీ పరీక్షా ఫలితాలపై విద్యార్థులు మౌన నిరసన

దీంతో వరంగల్ లోని యూనివర్సిటీ ప్రధాన భవనం వద్ద పీజీ విద్యార్థులు మౌనంగా తమ నిరసనను తెలియజేశారు. ప్రశ్నా పత్రాల మూల్యాంకనం లో తప్పు జరిగిందా, లేకా ఫలితాల విడుదల సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయా .. మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయి అన్నదానిపై విద్యార్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.

విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ కావడం ఇటు విద్యార్ధులనే కాదు, అటు యూనివర్సిటీలోని అధ్యాపకులను, తల్లిదండ్రులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకవేళ నిజంగానే ఒక్క విద్యార్థి మాత్రమే పాస్ అయితే ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి యూనివర్సిటీలోని బోధనా సిబ్బంది బాధ్యులు కారా అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది. లేదంటే మూల్యాన్కనంలో తప్పు జరిగి వుంటుంది కాబట్టి తిరిగి పేపర్లను మూల్యాంకనం చెయ్యాలని కోరుతున్నారు.

గతంలోనూ పరీక్షల నిర్వహణలో పలు తప్పిదాలు

గతంలోనూ పరీక్షల నిర్వహణలో పలు తప్పిదాలు

ఇటీవల మెడికల్ పరీక్షల నిర్వహణలో సైతం ఫార్మకాలజీ సబ్జెక్టుకు సంబంధించిన ఒక సెట్ బదులుగా మరో సెట్ ప్రశ్నాపత్రాలను ఇచ్చి విద్యార్థులను అయోమయానికి గురి చేయడమే కాకుండా తప్పు జరిగిందని నోరు కరుచుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు యూనివర్సిటీ తప్పిదాలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని కోరుతున్నారు. తమ భవిష్యత్తు తో ఆటలాడుకోవద్దు అని విన్నవిస్తున్నారు. మరి ఇంతకీ మెడికల్ పీజీ విద్యార్థుల ఫలితాల విషయంలో యూనివర్సిటీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kaloji Narayana Rao health University of Health Sciences is a public University in the city of Warangal. In this University students are facing problems in exams also. recently the university have conducted medical PG 1st year examinations and they announced shocking results. in 105 students 98 wrote the exams and one and only student passed in the PG 1st year exams. With these results students are disappointed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more