• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: నాలుగేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు హత్య! చేసింది భర్తా? ప్రియుడా?

By Ramesh Babu
|

హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వేమకుంటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల చిన్నారి సహా ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. మృతులను అపర్ణ, అమె తల్లి విజయలక్ష్మి, అపర్ణ కుమార్తె కార్తికేయినిగా గుర్తించారు.

సోమవారం స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... భీమవరానికి చెందిన అపర్ణ కొంతకాలంగా హైదరాబాద్‌లోని చందానగర్ ఉంటూ ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తోంది. రెండు రోజులుగా అమె తన విధులకు హాజరుకావడం లేదు.

కిటికీలోంచి తొంగిచూసేసరికి...

కిటికీలోంచి తొంగిచూసేసరికి...

రోజూ విధులకు హాజరయ్యే అపర్ణ రెండ్రోజులుగా రాకపోవడం అపర్ణ పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ షోరూంలోని తోటి సిబ్బందికి అనుమానం కలిగించింది. దీంతో సోమవారం వారు అపర్ణ ఇంటికి వచ్చారు. ఎంతసేపు పిలిచినా తలుపులు తెరవకపోవడంతో కిటికీలోంచి లోపలికి తొంగి చూసి నిర్ఘాంతపోయారు. లోపల వారంతా విగతజీవులై పడి ఉండడంతో షాక్ తిని పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు...

ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు...

చందానగర్‌లోని వేమకుంటలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో హత్యోదంతం గురించి సమాచారం అందగానే ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ భుజంగరావు, ఇన్‌స్పెక్టర్‌లు తిరుపతిరావు, హరిశ్చంద్రారెడ్డి పరిశీలించారు. అపర్ణను బలమైన కర్ర లేదా రాడ్ తో కొట్టడంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగి రెండ్రోజులు అవుతుండడంతో మ‌ృతదేహాలు కొద్దిగా కుళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని...

ప్రేమించి పెళ్లి చేసుకుని...

అపర్ణ పదేళ్ల క్రితం భీమవరం నుంచి నగరానికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మధు అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుందని, వారిద్దరికీ ఓ పాప పుట్టిందని, ఆ తరువాత మధుకు అంతకు ముందే మరొకరితో వివాహం అయ్యిందని అపర్ణకు తెలిసిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై భార్యభర్తలిరువురి మధ్య గొడవ జరిగిందని, దీంతో ఎనిమిదేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని చెబుతున్నారు.

భర్తా? ప్రియుడా? చంపిందెవరు?

భర్తా? ప్రియుడా? చంపిందెవరు?

మరోవైపు ఓ మొబైల్ షాప్ నిర్వాహకుడు రూప్‌లాల్ అనే వ్యక్తితో ప్రస్తుతం అపర్ణ ప్రేమలో ఉన్నట్లు కూడా స్థానికుల సమాచారం ద్వారా అర్థమవుతోంది. ఈ విషయంలో పగ పెంచుకుని ఆమె భర్త మధు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని కొందరు అంటున్నారు. మరికొందరేమో అపర్ణపై మోజు తీరిపోయిన ఆమె ప్రియుడు కూడా వారితో గొడవ పడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మధు, రూప్‌లాల్ దొరికితేగాని ఈ హత్య కేసులో మిస్టరీ వీడదని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు కూడా వారిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న దృష్ట్యా వారిద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

English summary
Including a 4-year-old kid two woman found murdered in an apartment flat which is located at Vemakunta of Chandanagar. According to the locals.. Police recognized the Victims are Aparna, her mother Vijayalakshmi and her daughter Karthikeyini. Aparna, who belongs to Bheemavaram came 10 years back to Hyderabad. She is working as a sales girl in a famous electronics showroom in the city. As she didn't attend her duties per the past two days, her co-employees came to her flat and nocked the door. As they didn't get any response, they tried to see inside from the window. They were shocked after they found dead bodies in the flat, immediately they informed the police on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X