హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్నెల్లుగా విక్రమ్ స్కెచ్.. ఇలా, పట్టించిన మొబైల్ డాటా, అరెస్ట్‌కు రంగం: నేర చరిత్ర పెద్దదే!

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను అరెస్టు చేసేందురు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. విక్రమ్ పైన కాల్పులు అనేక మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను అరెస్టు చేసేందురు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. విక్రమ్ పైన కాల్పులు అనేక మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.

సెక్షన్ 120, 120బి, 420, 404, ఆయుధాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఆయనను ఆసుపత్రిలోనే అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఫోన్ కాల్స్ చేయకుండా ఆయన వాట్సాప్ ద్వారా అంతా కథ నడిపాడు. ఆ మొబైల్ డాటానే ఇప్పుడు ఆయనను ప్రధానంగా పట్టించిందంటున్నారు.

తండ్రిని అలా బెదిరించి: పక్కా ప్లాన్‌తో ఆలస్యంగా నోరు విప్పిన విక్రమ్ తండ్రిని అలా బెదిరించి: పక్కా ప్లాన్‌తో ఆలస్యంగా నోరు విప్పిన విక్రమ్

తనపై కాల్పుల విషయంలో విక్రమ్ గౌడ్ ఆరు నెలల క్రితమే పక్కా ప్లాన్ తయారు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కథ నడిపించాడు.

ఇండోర్ షార్ఫ్ షూటర్‌తో ఒప్పందం... సిసి కెమెరాల తొలగింపు

ఇండోర్ షార్ఫ్ షూటర్‌తో ఒప్పందం... సిసి కెమెరాల తొలగింపు

తనపై కాల్పులు జరిపేందుకు ఇండోర్‌కు చెందిన షార్ఫ్ షూటర్‌తో విక్రమ్ గౌడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడని గుర్తించారు. ఆ షూటర్ పలు సినిమాల్లో నడించాడని తెలుస్తోంది. మూడు నెలల క్రితమే ఇంటి వద్ద ఉన్న సిసి కెమెరాలను ముందస్తు వ్యూహం ప్రకారం తొలగించారు. అంతా అనుకున్నాక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాడు.

Recommended Video

Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
మూడు రోజుల ముందు విందు, భార్యను ప్రిపేర్ చేశాడు

మూడు రోజుల ముందు విందు, భార్యను ప్రిపేర్ చేశాడు

తనపై కాల్పులు జరగడానికి మూడు రోజుల ముందు తనపై కాల్పులు జరిపిన ఇండోర్ షూటర్‌కు, ఇందులో పాలుపంచుకున్న తన స్నేహితులకు విక్రమ్ గౌడ్ తన ఇంటిలోనే విందు ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. అలాగే, తనపై కాల్పులు జరిగితే ఏం చేయాలనే దానిపై భార్య షిఫాలిని ముందే పూర్తిగా ప్రిపేర్ చేశారు.

దాంతో పాటు రాజకీయ సానుభూతి

దాంతో పాటు రాజకీయ సానుభూతి

తనపై కాల్పులు కథను విక్రమ్ గౌడ్ నడపడానికి పలు కారణాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఒకటి అప్పుల బాధ నుంచి తప్పించుకోవడం. తన తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి ఇవ్వడం. మరో విషయం ఏమంటే... తనపై కాల్పులు జరిపించుకోవడం ద్వారా సానుభూతి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది కూడా అతని వ్యూహంగా పోలీసులు గుర్తించారని సమాచారం. నందు అనే స్నేహితుడి ద్వారా ఇదంతా చేసినట్లుగా సమాచారం. విక్రమ్ అనుకున్నది ఒకటి అయితే, అయింది మరొకటి. చివరకు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని అంటున్నారు.

నేరచరిత్ర పెద్దదే

నేరచరిత్ర పెద్దదే

విక్రమ్ గౌడ్‌కు నేర చరిత్ర ఉందని చెబుతున్నారు. తండ్రి ముఖేష్ మంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో గన్‌మెన్ల సాయంతో సెటిల్మెంట్లకు పాల్పడేవాడని, పలువురిని బెదిరింపులకు గురి చేశాడని తెలుస్తోంది. అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.

నయీంతో సంబంధాల నుంచి సినిమా వారికి బెదిరింపుల దాకా

నయీంతో సంబంధాల నుంచి సినిమా వారికి బెదిరింపుల దాకా

నయీంతో విక్రమ్ గౌడ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ లింక్‌లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ భాగస్వాములను బెదిరించాడు. జుబ్లీహిల్స్‌లో పబ్ నిర్వాహకులపై దాడి చేశాడు. 2011లో మాదాపూర్ పిఎస్ పరిధిలో కేసు నమోదయింది. భూవివాదంలో బెదిరింపులపై అఫ్జల్ గంజ్ పిఎస్‍లో కేసు నమోదయింది. 2013లో బాలానగర్ పిఎస్ పరిధిలో ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. టిడిపి కార్యకర్త దేవరాజును ఏకే 47తో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

English summary
Shooting case: Vikram Goud hired gunmen to shoot him, five arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X