హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటి కేసు: అన్నీ బయటకు... జైలు నుంచి యోగి విడుదల, కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ కమ్ నటితో పాటు ఆమె భర్తకు అసభ్య సందేశాలు పెట్టిన కేసులో అరెస్టైన షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగి గురువారం చర్లపల్లి జైలు నుంచి బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

చదవండి: నేను ధైర్యంగా ముందుకొస్తే: నటి కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్, యోగికి బెయిల్ అంతలోనేచదవండి: నేను ధైర్యంగా ముందుకొస్తే: నటి కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్, యోగికి బెయిల్ అంతలోనే

తన పైన కేసు పెట్టడం అంటే మానసికంగా వేధించడమే అని వ్యాఖ్యానించారు. దీనిపై తాను చట్టపరంగా పోరాడుతానని చెప్పారు. ఆ నటి అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో తనపై దాడి చేయించిందని ఆరోపించారు. వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. అన్నీ వెలుగు చూస్తాయన్నారు.

చదవండి: 4 గంటల పాటు విచారణ, అసలు శశిధర్ ఎవరు, విజయ్ టార్చర్ చెప్పేస్తా: వనితారెడ్డి

యోగితో ఫేస్‌బుక్ పరిచయం

యోగితో ఫేస్‌బుక్ పరిచయం

యోగిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయిదు రోజులుగా పరారీలో ఉన్న అతనిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. బాధితురాలు గచ్చిబౌలి హిల్‌రిడ్జ్‌ అపార్టుమెంటులో ఉంటున్నారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్టువేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఈమెకు బీహెచ్‌ఈఎల్‌ సమీపంలోని విద్యుత్ నగర్‌లో నివాసముంటున్న యోగి(35)తో కొంతకాలం కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి అసభ్య సందేశాలు

అప్పటి నుంచి అసభ్య సందేశాలు

నటన పట్ల ఆసక్తి ఉన్న సదరు నటితో యోగేష్‌ స్నేహం పెంచుకున్నాడు. ఏడాదిపాటు సాఫీగా సాగిన స్నేహంలో ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. దీంతో యోగి ఆమెకు వాట్సప్‌, ఎస్సెమ్మెస్‌ల ద్వారా అసభ్య సందేశాలను పంపించాడని, ఆమె భర్తకు సైతం సదరు సందేశాలు పంపించి ఆమె కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తానంటూ ఇష్టానుసారంగా దూషించాడని పోలీసులు తెలిపారు.

రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

దీంతో బాధితురాలు ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించంది. అతనిపై 354(డీ)506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా అతనికి నోటీసులు జారీచేశారు. అయితే యోగి తప్పించుకు తిరగాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

గతంలో మహిళను వేధించిన కేసు

గతంలో మహిళను వేధించిన కేసు

మియాపూర్‌లోని 25వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి రూ.20వేల డిపాజిట్‌తో పాటు ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. సకాలంలో పూచీకత్తులు అందజేయకపోవడంతో యోగిని చర్లపల్లి జైలుకు తరలించారు. 2016లో ఓ మహిళను వేధించిన ఘటనలో కూడా అతనిపై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

దుబాయ్‌లో కాలో చెయ్యో తీసేస్తారు

దుబాయ్‌లో కాలో చెయ్యో తీసేస్తారు

ఇదిలా ఉండగా యోగి సదరు నటి తనతో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయనలా దుబాయ్‌లా చేస్తే కాలో చెయ్యో తీసి వేస్తారన్నారు.

English summary
Short Film director Yogi released from jail on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X