• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నటిపై యోగి వేధింపుల కేసులో మరో ట్విస్ట్: కీలక మెసేజ్‌లివే, యోగి అరెస్ట్

|

హైదరాబాద్: షార్ట్ ఫిల్మ్, సినీ నటిపై వేధింపుల కేసులో మరో మలుపు వెలుగులోకి వచ్చింది. నటి వేధింపుల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు యోగి ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ఆ నటికి, తనకు మధ్య జరిగిన చాట్ సంభాషణను బయటపెట్టారు.

ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లో యోగిని కాలితో తన్నిన డీసీపీ గంగిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ జరుపుతున్న పోలీసులకు.. తనదేమీ తప్పు లేదని, ఆ నటిదే తప్పని చెప్పేలా వాట్స్ యాప్ మెసేజ్ సాక్ష్యాలను యోగి పోలీసులకు అందించాడు. కేసు పెట్టేందుకు రెండు రోజుల ముందు ఆ నటికి, తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలను యోగి ఇప్పుడు పోలీసులకు ఇవ్వగా, అవి వైరల్ అవుతున్నాయి.

మెసేజ్‌లు ఇలా..

మెసేజ్‌లు ఇలా..

ఈ సంభాషణల్లో తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని యోగికి ఆ నటి మెసేజ్ పెట్టినట్టు ఉంది. తనకు ఓ యువకుడి తోడు కావాలని, అతను ప్రేమను పంచుతూ ఆప్యాయంగా చూసుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పింది. ఆ బాయ్ ఫ్రెండ్ అంగీకరిస్తే, వేరే దేశానికి వెళ్లేందుకు కూడా తాను సిద్ధమని కూడా చెప్పింది. అక్కడే కొంతకాలం హాయిగా బతకాలని ఉన్నట్టు చెప్పింది.

మళ్లీ పెళ్లి చేసుకుంటే..

మళ్లీ పెళ్లి చేసుకుంటే..

మళ్లీ పెళ్లి చేసుకుంటే కెరీర్ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మరో మెసేజ్‌లో తాను సిగరెట్, మద్యం తాగుతానని, ఈ కాలంలో మడిగట్టుకుని కూర్చుంటే ఏం సాధిస్తామని ప్రశ్నించింది.

సినిమాల కోసం..

సినిమాల కోసం..

తనకు సినిమా అవకాశాలు రావడం లేదని, అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఆమె పేర్కొన్నట్లుగా ఉన్న మెసేజ్‌లను యోగి పోలీసులకు కూడా పంపాడు. ఈ మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు పంపినట్లు యోగి తెలిపాడు. ఆమెతో సుమారు 2గంటలపాటు చాటింగ్ చేసినట్లు తెలిపాడు.

నన్నేందుకంటూ యోగి

నన్నేందుకంటూ యోగి

పంపిన మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారని.. అయితే, తనను అరెస్ట్ చేస్తాతమని చెబుతున్నారని యోగి తెలిపాడు. అసలు తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని యోగి ప్రశ్నించారు. చాలా మందిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తనపై అసత్యపు ఆరోపణలు చేసిందని యోగి చెప్పాడు. సినిమాల్లో అవకాశం రావడం లేదనే అసహనం, భర్త కూడా సరిగా చూసుకోకపోవడంతో నిరాశకు గురైన సదరు నటి ఈ విధంగా ప్రవర్తిస్తోందని యోగి తెలిపాడు.

యోగి అంతా క్రియేట్ చేశాడు, భయపడను: నటి

యోగి అంతా క్రియేట్ చేశాడు, భయపడను: నటి

యోగి క్రియేట్ చేసిందంతా నిజమైతే తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చేదాన్నే కాదని బాధిత నటి తెలిపింది. యోగి బూతులు తిట్టడంతోనే డీసీపీ అతడ్ని కాలితో తన్నాడని చెప్పింది. డీసీపీ తప్పేం లేదని తెలిపింది. తాను డీసీపీ కాలితో తన్నిన వీడియో తీసి, యోగికి పంపించానా? అని ఆమె ప్రశ్నించింది. యోగి తనపై అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని బాధితురాలు చెప్పింది. యోగిలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా తాను ఎదుర్కొంటానని, యోగికి ఎవరూ మద్దతు పలకవద్దని అన్నారు. తాను యోగిలాంటి వాళ్లకు భయపడనని అన్నారు.

యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు

యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇది ఇలా ఉండగా, బాధిత నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిందితుడైన యోగిని బుధవారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు అనంతరం గత కొన్ని రోజులుగా యోగి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం యోగిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Short film director Yogi sends some key message to police, of the victim actress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more