వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ‌కీయాల‌కు ప్ర‌జాసేవ అవ‌స‌రం లేదా..? సినిమాలు నిర్మిస్తే స‌రిపోతుందా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీటు పొంద‌డానికి ప్ర‌జా సేవ కాకుండా మ‌రేఇత‌ర కొల‌మానాలు ఉన్నాయా..? ముంద‌స్తు ఎన్నిక‌లకు తెర లేపిన తెలంగాణ‌లో, అదికార పార్టీని గ‌ద్దె దించేందుకు మ‌హాకూట‌మి గా ఏర్ప‌డిన ప్ర‌తిప‌క్ష పార్టీల‌లో సీటు తెచ్చుకోవ‌డం మ‌రీ అంత సుల‌భ‌మా..? ప‌్ర‌జా సేవతో సంబందం లేక‌పోయినా, రాజ‌కీయాలు తెలియ‌క‌పోయినా, చ‌ట్టాలు, చ‌ట్ట‌స‌భ‌లు, రాజ్యాంగం తెలియ‌క పోయినా ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవ‌చ్చా..? ప‌్ర‌జ‌ల్లో గుర్తింపు పొందేందుకు నాలుగు చెత్త సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తే స‌రిపోతుందా..? తెలంగాణ మ‌హాకూట‌మిలో పారిశ్రామిక వేత్త‌గానే కాకుండా సినిమా నిర్మాత‌గా ముద్ర వేసుకున్న ఆ వ్య‌క్తికి రాజ‌కీయాలే తెలియ‌దు., ప్ర‌జా జీవ‌తం గాని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి గాని అస‌లే తెలియ‌దు. కానీ అక‌స్మాత్తుగా తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీడిపి త‌రుపున పోటీ చేసేందుకు రూట్ క్రియ‌ర్ చేసుకున్నారు. అందుకోసం ఎంటీఆర్ వార‌సుడు, ప్ర‌ముఖ న‌టుడు ఆయ‌నకు అండ‌దండ‌లు అందించిన‌ట్టు తెలుస్తోంది. ఇంత చేసిన స‌ద‌రు నిర్మాత గెలుపు పైన సందేహం వ్య‌క్తం చేస్తున్నారు స్థానికులు.

శేరిలింగంప‌ల్లి టీడిపిలో కొత్త ముఖం..! తెర‌పైకి నిర్మాత భవ్య ప్ర‌సాద్..!!

శేరిలింగంప‌ల్లి టీడిపిలో కొత్త ముఖం..! తెర‌పైకి నిర్మాత భవ్య ప్ర‌సాద్..!!

పొత్తుల ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. ఈ కారణంగా కూటమిలోని పార్టీల మధ్య చిచ్చు రేగింది. తెలంగాణ జన సమితి, సిపిఐ తమ సీట్ల కోసం పట్టుపడుతున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం అధినేత చంద్రబాబు సూచన మేరకు కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో టిడిపి చాలా స్థానాల్లో బలంగానే ఉంది. కానీ, ఆ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది. బలమైన స్థానాలనువదులుకోవడం తో పాటు, టికెట్ కేటాయించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది.

ప్ర‌జాజీవితం, రాజ‌కీయం తెలియ‌దు..! ఐనా ముఖ్య‌మైన స్థానం కొట్టేసిని ఆనంద్..!

ప్ర‌జాజీవితం, రాజ‌కీయం తెలియ‌దు..! ఐనా ముఖ్య‌మైన స్థానం కొట్టేసిని ఆనంద్..!

తాజాగా తెలుగుదేశం పార్టీలో బయటకు వచ్చిన వివాదమే దీనికి ఉదాహరణ. అన్ని పార్టీలో లాగానే టిడిపిలో కూడా అసమ్మతి రేగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిడిపి బాగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. కాబట్టి అక్కడ నుంచి బరిలోకి దిగేందుకు టిడిపి నేతలు పోటీపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా భవ్య సిమెంట్స్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత వెనిగళ్ళ ఆనంద ప్రసాద్, ఇటీవలే టిఆర్ఎస్ నుంచి టిడిపిలో చేరిన మొవ్వ సత్యనారాయణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

శేరిలింగంప‌ల్లిలో ఖ‌చ్చితంగా గెలుస్తాం..! సీటు త‌స‌కే ఇవ్వాలంటున్న మొవ్వా...!

శేరిలింగంప‌ల్లిలో ఖ‌చ్చితంగా గెలుస్తాం..! సీటు త‌స‌కే ఇవ్వాలంటున్న మొవ్వా...!

శేరిలింగంపల్లి టికెట్ కోసం టీడీపీలోనూ రగడ మొదలయ్యింది. ఈ సీటు ఆశిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ నుంచి మళ్లీ టీడీపీలో చేరిన మొవ్వా సత్యనారాయణ కూడా శేరిలింగంపల్లిపై ఆశ పెట్టుకున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య గొడవ మొదలయ్యింది. ఇటీవలే ఈ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్ద రాద్ధాంతం చేశారు. టికెట్ ఆనంద్ ప్ర‌సాద్ కి కేటాయించ‌డంతో వారి మ‌ద్చ ప్ర‌శ్చ‌న్న‌యుద్దం తారా స్థాయికి చేరుకుంది.

బాల‌క్రిష్ణ రిక‌మండేష‌న్ తోనే ఆనంద్ కి టికెట్..! గెలుపుపై మాత్రం సందేహ‌మే..!!

బాల‌క్రిష్ణ రిక‌మండేష‌న్ తోనే ఆనంద్ కి టికెట్..! గెలుపుపై మాత్రం సందేహ‌మే..!!

అయితే, టీడీపీ అధిష్టానం మాత్రం ఆనంద్ ప్రసాద్ కి టికెట్ కేటాయించింది. ఈయనకు టికెట్ ఇవ్వడం వెనక నందమూరి బాలకృష్ణ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన పైసా వసూల్ సినిమా ఆనంద్ ప్రసాద్ కు టిడిపి టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారట. ఆ హామీని బట్టే ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆనంద్ ప్రసాద్ కు టికెట్ కేటాయించిందని ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలు నిర్దారిస్తున్నాయి. ఐతే రాజ‌కీయాల‌కు కొత్తైన ఆనంద్ కు టికెట్ ఇవ్వ‌డం చంద్ర‌బాబుకు ఏమాత్రం ఇష్టం లేద‌ని, కేవ‌లం బాల‌క్రిష్ణ ఒత్తిడి మేర‌కు ఓకే చెప్ప‌న‌ట్టు తెలుస్తోంది.

English summary
Nandamuri Balakrishna is behind the bhavya anand prasad's ticket. According to latest information, Bayya promised to give him a ticket to Anand Prasad for his Paisa Vasul movie. NTR Bhavan sources have confirmed that the ticket was given for Anand Prasad by TDP chief Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X