మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఐ ఆత్మహత్య: ఎట్టకేలకు సిద్దిపేట డీఎస్పీ, మరో 7గురిపై చర్యలు

|
Google Oneindia TeluguNews

మెదక్‌: జిల్లాలోని కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిని వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిని ఎట్టకేలకు బాధ్యతల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. వారు పెడుతున్న ఇబ్బందులను తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి, ఆగస్టు 17న ఎస్సై రామకృష్ణారెడ్డి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు.

ఈ క్రమంలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌, తొగుట, సిద్దిపేట గ్రామీణ సీఐలు రామాంజనేయులు, వెంకటయ్య, కుకునూరుపల్లి ఏఎస్సై ప్రకాశ్‌, హెడ్‌కానిస్టేబుళ్లు ముత్యం, సంభాని, కానిస్టేబుళ్లు యాదవరెడ్డి, నాగిరెడ్డిలపై చర్యలకు ఉపక్రమించారు.

డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఆదేశాలు జారీచేశారు. మిగతావారిని విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

విచారణ తీరుపై డీఐజీ ఆగ్రహం

విచారణ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకున్‌ సబర్వాల్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఆయన ఎస్సై ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించి, తర్వాత కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ శ్రీధర్‌, ఏఎస్సై ప్రకాశ్‌, మరో నలుగురు సిబ్బందిని డీఐజీ ఒక్కొక్కరిగా పిలిచి ప్రశ్నించారు. మెదక్‌ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తానే స్వయంగా ఈ విచారణను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

హోంమంత్రితో ఎస్ఐ కుటుంబం

హోంమంత్రితో ఎస్ఐ కుటుంబం

మెదక్‌ జిల్లాలోని కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డిని వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిని ఎట్టకేలకు బాధ్యతల నుంచి తప్పించారు.

హోంమంత్రితో ఎస్ఐ కుటుంబం

హోంమంత్రితో ఎస్ఐ కుటుంబం

వారు పెడుతున్న ఇబ్బందులను తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి, ఆగస్టు 17న ఎస్సై రామకృష్ణారెడ్డి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు.

ఎస్ఐ భార్య, కుటుంబం

ఎస్ఐ భార్య, కుటుంబం

ఈ క్రమంలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌, తొగుట, సిద్దిపేట గ్రామీణ సీఐలు రామాంజనేయులు, వెంకటయ్య, కుకునూరుపల్లి ఏఎస్సై ప్రకాశ్‌, హెడ్‌కానిస్టేబుళ్లు ముత్యం, సంభాని, కానిస్టేబుళ్లు యాదవరెడ్డి, నాగిరెడ్డిలపై చర్యలకు ఉపక్రమించారు.

ఎస్ఐ భార్య, కుమారుడు

ఎస్ఐ భార్య, కుమారుడు

డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం ఆదేశాలు జారీచేశారు. మిగతావారిని విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

ఎస్ఐ భార్య, కుమారుడు

ఎస్ఐ భార్య, కుమారుడు

సూసైడ్‌నోట్‌లో వీరి పేర్లను ప్రస్తావించిన ఎస్సై రామకృష్ణారెడ్డి... మామూళ్ల కోసం వీరంతా ఒక్కటై తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. వీరిని విధుల నుంచి తొలగించకపోగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ శ్రీధర్‌ సమక్షంలోనే నిజామాబాద్‌ అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ చేపట్టడం పలు అనుమానాలకు తావిచ్చింది.

English summary
Director General of Police (DGP) Anurag Sharma has attached Siddipet Deputy Superintendent of Police Sridhar Goud to his office with immediate effect
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X