సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధ కలిగించారా?: సిద్దిపేట ఎల్లమ్మ కంటనీరు, తండోపతండాలుగా భక్తులు

|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో కొలిచే సిద్దిపేట ఎల్లమ్మ కన్నీరు కారుస్తున్నదనే వార్త ఇప్పుడు స్థానికంగా కలకలంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

జిల్లా పరిధిలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలోని విగ్రహం నుంచి గత రెండు రోజులుగా కన్నీరు వస్తోందని ప్రచారం సాగుతోంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఎల్లమ్మను దర్శించుకుంటున్నారు.

siddipet yellamma tears

కాగా, రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా చంద్లాపూర్ గ్రామం ముంపు గ్రామమైంది. దీంతో అమ్మకు బాధకలిగిందని, అందువల్లే రేణుక ఎల్లమ్మ తల్లి ఏడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

English summary
It is said that Siddipet yellamma tearing for chandlapur village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X