వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినారె గజల్ గీతాంజలి: ఈరోజు సాయంత్రం రవీంద్రభారతిలో..

సినారె గజల్ గీతాంజలి' పేరిట సాగే ఈ కార్యక్రమం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఎనలేని ఖ్యాతిని గడించి ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారెను స్మరించుకోవడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 'సినారె గజల్ గీతాంజలి' పేరిట సాగే ఈ కార్యక్రమం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరగనుంది.

శుక్రవారం సాయంత్రం 6గం.కు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు నందన్ రాజ్ నిర్వహించనున్నట్లు హరికృష్ణ తెలిపారు.రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలాహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి, సి.ఎం. ఓ.ఎస్. డి. శ్రీ దేశపతి శ్రీనివాస్ పాల్గొననున్నారు.

Sinare gazal geetanjali event in Ravindra Bharati

కాగా, ఇటీవల నందన్ రాజ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన 'రేలారే.. రేలారే..' పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణ నేల గొప్పదనాన్ని వివరిస్తూ సాగే ఈ పాట.. తక్కువ కాలంలోనే దాదాపు 16లక్షల హిట్స్‌ను సొంతం చేసుకుంది. భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని బెస్ట్ మ్యూజికల్ హిట్స్ వచ్చే అవకాశం ఉంది.

English summary
Telangana language and cultural department director Mamidi Harikrishna said there is a event 'Sinare Gazal Geetanjali' in Ravindra Bharati on 23rd June
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X