వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు సింగరేణి మణికిరీటం, నేడు సింగరేణి ఆవిర్భావదినోత్సవం

తెలంగాణ కు మణి కిరీటంగా ఉన్న సింగరేణి ఆవిర్భావదినోత్సవం ఈరోజు. 123 ఏళ్ళ చరిత్ర సింగరేణికి ఉంది. అనేక ఏళ్ళ చరిత్ర ఉన్న సింగరేణి వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల :తెలంగాణకు సింగరేణి మణి కిరీటం, సింగరేణి సిరుల మాగాణి, పారిశ్రామిక పురోగతికి తళ తళ మెరిసే నల్లబంగారు లోకం. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో వెలుగొందుతున్న సింగరేణి.

బొగ్గుబావుల ప్రస్థానం
భూగర్భ పొరల్లో నిక్షిప్తమైన బొగ్గు సింగరాయ్యపల్లె అనే కుగ్రామంలో బయట పడింది. కొందరు బాటసారులు వంట వండుకునే సమయంలో పొయ్యి రాళ్లుగా మార్చిన రాళ్లు మండడంతో, ఈ విషయాన్ని బ్రిటిష్‌ అధికారులకు తెలియజేయడంతో 1870లో బ్రిటిష్‌ అధికారులు దానిపై పరిశోధనలు చేశారు. వారి అన్వేషణ 1889 సంవత్సరంలో సత్ఫలితాలిచ్చింది. డాక్టర్‌ విలియం కింగ్‌ ఆధ్వర్యంలో సాంకేతికంగా బొగ్గును వెలికి తీసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వం నువీండి మీర్‌ ఉస్మాన్‌ఖాన్‌ అనే నిజాం ప్రభువు సింగరేణిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో విశేషమైన అభివృద్ధిని సాధించింది.

సింగరేణి పయనం
1870లో బొగ్గు అన్వేషణ చేసి, 1889లో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 1920 సంవత్సరంలో బ్రిటీష్‌ ప్రభుత్వం నుండి నిజాంలు స్వాధీనం చేసుకున్నారు. 1945లో లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో స్థానం సంపాదించింది. 1949లో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు లభించింది. 1961లో విద్యుత్తు సాధనంతో డ్రిల్లింగ్‌ పనులు చేశారు. 1953లో బ్యాటరీతో నడిచే ల్యాంపులు వచ్చాయి. 1974లో ఓపెన్‌కాస్టుల ద్వారా బొగ్గు వెలికితీత పనులు చేశారు. 1976లో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టారు. 1983లో లాంగ్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1986లో బ్లాస్టింగ్‌ గ్యాలరీతో బొగ్గు ఉత్పత్తి, 1992-1996 వరకు సింగరేణి సంస్థ ఖాయిలపడ్డ పరిశ్రమల జాబితాలో చేరింది. 1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 2000 సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల బాటకు చేరుకుంది. 2009లో కింన్యూస్‌ మైనర్‌ యంత్రం ప్రవేశం, 2010లో సింగరేణిలో తొలి విద్యుత్తు ప్లాంటు శంఖుస్థాపన, 2010 నవంబర్‌లో మ్టి నుండి ఇసుక తీసే యంత్రం ప్రారంభం, డిసెంబర్‌లో హైవాల్‌ టెక్నాలజి ప్రవేశంతో సింగరేణి అభివృద్ధి దిశలో దూసుకుపోతు తెలంగాణ ప్రాంతానికి మణిహారంగా మారింది.

 singareni formation day today
నాడు అట్టహాసం.. నేడు కరువు ..
తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా 123 ఏండ్ల పైన చరిత్ర వున్న సింగరేణిలో డిసెంబర్‌లో ఏా నిర్వహించే ఉత్సవాలను యాజమాన్యం నీరుగారుస్తోందని కార్మిక వర్గం నుండి నిరసన వ్యక్తం అవుతోంది. ఉత్పత్తి ఉత్పాదకతలో చూపిస్తున్న శ్రద్ధ కార్మికులపై చూపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాయిలపడిన సంస్థను లాభాల బాటలో నిడిపిస్తున్న సింగరేణి విజయోత్సవ వేడుకలను యాజమాన్యం నీరు గార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మూడు రోజులపాటు సింగరేణి వేడుకలు నిర్వహించేది. కార్మికులు తమ కుటుంబాలతో వచ్చి తాము సాధించిన ప్రగతిని చెప్పి మురిసిపోతూ ఆనందించేవారు. ప్రస్తుతం సింగరేణి వేడుకలను ఒక్క రోజుకు పరిమితం చేసి తూతూ మంత్రంగా వేడుకలను నిర్వహిస్తున్నారని కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేడు జరుగనున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలపై ఆనందోత్సహాల మధ్య నిర్వహించాలని కార్మిక వర్గం కోరుతుంది.
English summary
signgareni formation day today. from 123 years drilling for coal mining in telangana state .sigareni company statred open cast drilling works from 1974 year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X