వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి చారిత్రాత్మక నిర్ణయం : వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్

|
Google Oneindia TeluguNews

సింగరేణి చారిత్రాత్మక నిర్ణయం : వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణి నుంచి చారిత్రక నిర్ణయం వెలువడింది. రెండు దశాబ్దాలుగా డిమాండ్ కే పరిమితమైన వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తూ.. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్).

ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు.. ఇప్పటికే దీనిపై సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులతో చర్చించగా.. తాజాగా సింగరేణి ఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన విధి విధానాలు, ఇతరత్రా బెనిఫిట్స్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

singareni

సింగరేణి బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:

అక్టోబ‌ర్ 11, 2016 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సుగ‌ల కార్మికులు వారసత్వ ఉద్యోగాలు తమ వారికి ఇవ్వమని కోరడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
* ఉద్యోగికి సంబంధించి కొడుకు, అల్లుడు లేదా త‌మ్ముడు అర్హులు
* ఉద్యోగం పొందేవారి వ‌య‌సు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి

1998లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలను పక్కనబెట్టగా.. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇందుకోసం 1981-చట్టంను పునరుద్దరించడం ద్వారా న్యాయపరంగా ఎటువంటి సమస్యలు రావని నిర్దారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సింగరేణి అధికారులు చెబుతున్నారు.

బొగ్గు గని కార్మికులు రాష్ట్ర సైనికులు: ఎంపీ క‌విత

సింగరేణి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ..బొగ్గు గని కార్మికులు రాష్ట్ర సైనికులని స్పందించారు ఎంపీ కవిత. వారి ఉద్యోగ బాధ్యత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేసిన ఆమె..ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఎంతోమంది కార్మికులకు లబ్ధి చేకూరునుందన్నారు.

ఇక మరో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ దీనిపై స్పందిస్తూ.. వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామని ఎన్నికల నాడే కేసీఆర్ చెప్పారని, చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

English summary
Singareni was taken a historical decision in the board of company meeting. Singareni MD Sidhar had announced that company was given green signal for dependent jobs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X