వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్కంఠకు తెర: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు, షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Election Dates Announced

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై నెలకొన్న ఉత్కంఠకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన పోలింగ్‌ జరగనుం‍ది. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టతనిచ్చింది.

<strong>4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు</strong>4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు

తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్‌తోపాటే అనూహ్యంగా ఆయన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

Single phase polls in Telangana on Dec 7, counting on Decemebr 11

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇలా

- నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్

- నామినేషన్లకు తుది గడువు: నవంబర్‌ 19

- నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 28
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్‌ 22
- పోలింగ్‌ తేదీ: డిసెంబర్‌ 7
- ఓట్ల లెక్కింపు: డిసెంబర్‌ 11

''తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల షెడ్యూల్‌ ఎలా ప్రకటిస్తారనే అనుమానాలు ఉన్నాయి. కేసు ఓటర్ల జాబితాకు సంబంధించింది మాత్రమే. ఓటర్ల జాబితాను సరిచేయడానికి తగినంత సమయం ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించి కోర్టుకు అన్ని వివరాలనూ నివేదిస్తాం. మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికల సంఘం వెళ్లాల్సి ఉందన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు వెళ్తాం.'' రావత్‌ అని వివరించారు.

అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. తెలంగాణలో ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

English summary
Chief Election Commissioner O P Rawat on Saturday said that the state of Telangana would go to the polls on December 7. The results for 119 seats in Telanagana assembly will be announced on December 11, four days after the single phase poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X