వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరీస్ కంపెనీ ఛైర్మెన్ గోకరాజు సుబ్బారాజుఅరెస్టు, కారణమిదే

భూమి రిజిస్ట్రేషన్ కేసులో అవినీతికి పాల్పడిని సీరీస్ కంపెనీ ఛైర్మెన్ గోకరాజు సుబ్బారాజు ను రాచకొండ పోలీసులు అరెస్టుచేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భూమి రిజిస్ట్రేషన్ కేసులో అవినీతికి పాల్పడిని సీరీస్ కంపెనీ ఛైర్మెన్ గోకరాజు సుబ్బారాజు ను రాచకొండ పోలీసులు అరెస్టుచేశారు.

అవినీతి నిరోధకశాఖాధికారులు బాలానగర్, కూకట్ పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారంనాడు సోదాలు నిర్వహించి సంబంధించిన ఆధారాలను సేకరించారు.మేడ్చల్ సబ్ రిజిష్ట్రార్ టి.రమేష్ చందర్ రెడ్డితో ఆయన కుమ్మక్కయ్యారని తేలిందని పోలీసులు చెబుతున్నారు.

సర్వే నెంబర్ లోని 9/4 లో 10,950 చదరపు గజాల భూమిని విక్రయించాడు. అయితే ఈ భూమికి చదరపు గజానికి 35 వేలను స్టాంప్ డ్యూటీ కింద వసూలు చేయాలి. కానీ, రాజుతో కుమ్మకైన సబ్ రిజిస్ట్రార్ కేవలం 13 వేలను మాత్రమే వసూలు చేశాడు.

 SIRIS company chairman arrested in land registration fraud case

దీనివల్ల ప్రభుత్వానికి సుమారు 145 కోట్లరూపాయాల నష్టం వాటిల్లింది. దీనికిసంబంధించిన ఆధారాలను సేకరించినట్టు ఎల్బీనరగ్ ఏసీపీ పి. వేణుగోపాల్ చెప్పారు. అయితే సబ్ రిజిస్ట్రార్ ఇప్పటికే జైలులో ఉన్నాడు.

ఈ కేసులో అదృశ్యమైన 11 మందిని పట్టుకొనేందుకు గాలించేందుకు స్పెషల్ టీమ్ లను ఏర్పాటుచేసినట్టు పోలీసులు తెలిపారు.

మరో వైపు భూముల రిజిస్ట్రేషన్ కేసులకు సంబంధించిన వ్యవహరంలో ఉన్న బాలానగర్ పోలీసులు మహ్మద్ ముబ్రాజుద్దీన్ కాన్ ను అరెస్టు చేశారు. ఆయన సనత్ నగర్ కు చెందినవాడు. బాలనగర్ లో భూమి రిజిస్ట్రేషన్ కేసులో రిజిస్ట్రార్ యూసుఫ్ ఇప్పటికే అరెస్టయ్యారు.

అయితే ఎప్పటికప్పుడు ఆకస్మాత్తుగా ఎసీబీ సోదాలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. కూకట్ పల్లి, భువనగిరి సబ్ రిజిష్ట్రార్ల ఉద్యోగుల ఇళ్ళలో సోదాలు సాగుతాయని పోలీసులు తెలిపారు.

English summary
South India Research Institute Private Limited (SIRIS) chairman and managing director Gokaraju Subba Raju was arrested by Rachakonda police for his alleged role in the LB Nagar land registration fraud case. Police arrested Raju from his residence at Jubilee Hills on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X