హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిరీష కేసులో కొత్త ట్విస్ట్: ఆ చెట్టుకిందే ఏదో జరిగిందంటున్న బంధువులు

బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో మరో కొత్త కోణం వచ్చి చేరింది. కుకునూరుపల్లిలోని హనుమాన్ ఆలయం సమీపంలోని ఓ చెట్టు కిందనే శిరీష, రాజీవ్, ప్రభాకర్ రెడ్డిలు గొడవపడ్డారని శిరీష బంధువుల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో మరో కొత్త కోణం వచ్చి చేరింది. కుకునూరుపల్లిలోని హనుమాన్ ఆలయం సమీపంలోని ఓ చెట్టు కిందనే శిరీష, రాజీవ్, ప్రభాకర్ రెడ్డిలు గొడవపడ్డారని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడే ఏదో జరిగిందని వారంటున్నారు.

శిరీష-ప్రభాకర్ రెడ్డి, ఫోన్లే కీలకం: హైదరాబాద్-కుకునూరుపల్లి ఎప్పుడేం జరిగిందంటే?శిరీష-ప్రభాకర్ రెడ్డి, ఫోన్లే కీలకం: హైదరాబాద్-కుకునూరుపల్లి ఎప్పుడేం జరిగిందంటే?

కుకునూరుపల్లికి బంధువులు

కుకునూరుపల్లికి బంధువులు

ఈ నేపథ్యంలో శిరీష బంధువుల అనుమానాలను నివృత్తి చేసేందుకు వారిని టాస్క్ ఫోర్సు పోలీసులు కుకునూరుపల్లికి తీసుకెళ్లారు. అక్కడే వారి అనుమానాలను నివృత్తి చేయనున్నట్లు తెలిసింది.

సంతృప్తి చెందుతారా?

సంతృప్తి చెందుతారా?

అయితే, పోలీసులు చెప్పే సమాధానంతో వారు సంతృప్తి చెందుతారా? లేక శిరీషది హత్యేనంటూ వాదిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికికాదని, ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ అయినా రాసివుండేదని ఆమె బంధువులు వ్యాఖ్యానించారు.

ఆ ముగ్గురి వల్లే..

ఆ ముగ్గురి వల్లే..

రాజీవ్, శ్రావణ్, ప్రభాకర్ రెడ్డిలే తమ శిరీషను హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం శిరీషది ఆత్మహత్యేనని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. అనుమానాలుంటే నివృత్తి చేస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

రోజు తేడాలో ఇద్దరు ఆత్మహత్యతో కలకలం

రోజు తేడాలో ఇద్దరు ఆత్మహత్యతో కలకలం

కాగా, శిరీష హైదరాబాద్‌లోని రాజీవ్‌కు చెందిన స్టూడియోలో ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మొదట ఇవి రెండు వేర్వేరు ఘటనలనుకున్నప్పటికీ.. తర్వాత ఈ రెండు ఆత్మహత్యలు ఒకదానికొకటి సంబంధముందని పోలీసులు తేల్చారు. రాజీవ్, తేజస్వి ప్రేమ వ్యవహారం, రాజీవ్, శిరీషల మధ్య రాజీ కుదిర్చేందుకే కుకునూరుపల్లికి రాజీవ్, శిరీష, శ్రావణ్‌లు వెళ్లిన విషయం తెలిసిందే. వీరంతా అక్కడే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో మద్యం తాగుతూ చర్చించారు. కాగా, మరుసటి తెల్లవారుజామున శిరీష ఆత్మహత్య చేసుకోగా, ఆ మరుసటి రోజే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

పూర్తి స్థాయి స్పస్టత ఏది?

పూర్తి స్థాయి స్పస్టత ఏది?

ఇది ఇలా ఉండగా, శిరీషపై అత్యాచారం జరగలేదని, ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతుండగా.. ఆమెది హత్యేనని, ఇందుకు కారణమైన రాజీవ్, శ్రావణ్‌లను కఠినంగా శిక్షించాలని శిరీష బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాజీవ్, శిరీషల మధ్య వివాహేతర సంబంధం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. శిరీష ఆత్మహత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు శ్రావణ్, మరో నిందితుడు రాజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నెలరోజులకుపైగా దర్యాప్తు జరుగుతున్నా శిరీష, ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్యల కేసులో పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోవడం గమనార్హం.

English summary
Sirisha family members suspecting what happened in Kukunoorpally in Sirisha case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X