వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్:ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని ఎసిపి వేధించాడు, ఆ ఫోన్‌తోనే ఆత్మహత్య

గత నెలలో సంచలనం సృష్టించిన బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యలు సంచలనం సృష్టించాయి. శిరీష ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తేల్చారు. తాజాగా ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి కూడ ఆత్మహత్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత నెలలో సంచలనం సృష్టించిన బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యలు సంచలనం సృష్టించాయి. శిరీష ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తేల్చారు. తాజాగా ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి కూడ ఆత్మహత్య చేసుకొన్నాడని దర్యాప్తు అధికారులు నివేదికను ఇచ్చారు.

మరో ట్విస్ట్: ఫ్రెండ్ ను తారుస్తావా అంటూ శిరీష గొడవమరో ట్విస్ట్: ఫ్రెండ్ ను తారుస్తావా అంటూ శిరీష గొడవ

గత మాసంలో బ్యూటీషీయన్ శిరీష తాను పనిచేసే ఆర్‌జె స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆ మె మరణంపై కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేశారు.

అయితే ఈ అనుమానాలను పోలీసులు కొట్టిపారేశారు. ముమ్మాటికీ ఆమె ఆత్మహత్య చేసుకొందని శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలున్నాయని వారు ప్రకటించారు. ఈ కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీకి తీసుకొన్న తర్వాత కూడ మరోసారి విచారించి ఇదే విషయాన్ని తేల్చారు.

కుకునూర్ ఎస్ఐ ఆత్మహత్యలో ట్విస్ట్: బ్యూటీషీయన్ శిరీషతో అసభ్యంగా ప్రవర్తించాడా?కుకునూర్ ఎస్ఐ ఆత్మహత్యలో ట్విస్ట్: బ్యూటీషీయన్ శిరీషతో అసభ్యంగా ప్రవర్తించాడా?

మరోవైపు బ్యూటీషీయన్ శిరీష మరణానికి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మమహత్యకు కూడ సంబంధం ఉందని కూడ పోలీసులు తేల్చారు. శఇరీష ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన వెంటనే భయంతోనే ఆయన కూడ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు.

Recommended Video

Beautician Sirisha Case Mystery Revealed
ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్యే

ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్యే

కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిది ఆత్మహత్యేనని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ నివేదిక ప్రకారంగా ఇదివరకే ప్రాథమిక నివేదికను దర్యాప్తు అధికారులు డిజిపి అనురాగ్‌శర్మకు అందించారు. తాజాగా శనివారంనాడు తుదినివేదికను అదనపు డిజిపి గోపికృష్ణ తన నివేదికను అందించారు. బ్యూటీషీయన్ శిరీష కేసు విషయమై ఆయన ఎప్పటికప్పుడు విచారణ విషయాలను తెలుసుకొన్నాడని అయితే ఈ కేసు తన మెడకు చుట్టుకొనే అవకాశం ఉందని భావించి ఆత్మహత్య చేసుకొన్నాడని తేల్చారు. ఈ మేరకు అడిషనల్ డిజి గోపికృష్ణ శనివారంనాడు డిజిపి అనురాగ్‌శర్మకు తుదినివేదికను ఇచ్చారు. బ్యూటీషీయన్ శిరీషపై అత్యాచారయత్నానికి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకొంది.

 ఫోన్ చేసి చివరికిలా..

ఫోన్ చేసి చివరికిలా..

చనిపోయేముందు బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్‌తో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడాడని పోలీసులు నివేదికలో తేల్చారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఈ కేసులో తన పేరును బయటకు రాకుండా చూడాలని ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి శ్రవణ్‌ను కోరాడు. అయితే శ్రవణ్ ,రాజీవ్‌లు ఈ విషయాన్ని పాటించారు.అయితే కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని ప్రభాకర్‌రెడ్డి తెలుసుకొన్నాడు. తన బ్యాచ్‌మేట్ అయిన బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్‌తో ఆయన కేసు విచారణ విషయాలను తెలుసుకొన్నాడు. శిరీషతో సహ అందరూ కూడ క్వార్టర్‌లోనే మద్యం సేవించారని ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని హరీందర్ అడిగాడు అయితే ఈ విషయమై ప్రభాకర్‌రెడ్డి ఆయనకు ఏదో సమాధానం చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. హరీందర్‌తో మాట్లాడిన అరగంటకే ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు తేల్చారు.

ఎసిపి గిరిధర్ వేధించాడు

ఎసిపి గిరిధర్ వేధించాడు

గజ్వేల్ ఎసిపి గిరిధర్ కూడ కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని వేదించాడని పోలీసులు తేల్చారు. ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించినట్టుగా గిరిధర్ ప్రభాకర్‌రెడ్డిని వేదించిన విషయం వాస్తవమేనని అడిషనల్ డిజిపి గోపికృష్ణ తన నివేదికలో ప్రస్తావించారు. గిరిధర్ వేధింపుల కారణంగానే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.అయితే ఈ ఆత్మహత్యకు గిరిధర్ వేధింపులు కారణం కాదని తేల్చారు.

మరికొందరిపై చర్యలు

మరికొందరిపై చర్యలు

ఇప్పటికే ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని వేధించిన కేసులో పలువురిపై చర్యలు తీసుకొన్నట్టు అడిషనల్ డిజిపి గోపికృష్ణ తన నివేదికలో ప్రస్తావించారు. అయితే మరికొందరిపై కూడ వేటు ఉండే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసుశాఖలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో ఈ కేసుకు ప్రాధాన్యత నెలకొంది. అయితే ప్రభాకర్‌రెడ్డిని వేదించినట్టు ఆరోపణలున్న ఇతరులపై కూడ చర్యలు తీసుకోనుంది ఆ శాఖ.

English summary
A report on the suicide of Kukunoorpally sub inspector Prabhakar Reddy who shot himself a month ago, was submitted to the DGP. Additional DG Gopi Krishna who was ordered to inquire into the matter, submitted a four-page report to the DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X