వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష ఏం చేసిందంటే..: తల్లిదండ్రులకు ఆధారాలు చూపిన పోలీసులు

బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు, బంధువుల అనుమానాలను నివృత్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. గురువారం వారిని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ఆమె తల్లిదండ్రులు, బంధువుల అనుమానాలను నివృత్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. గురువారం వారిని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు.

చదవండి: ట్విస్ట్.. 4 ఏళ్లు కాదు: 'శిరీషని చంపేశారు.. సాక్ష్యాలు, రాజీవ్‌కు సంబంధం చూడమని..'

గొడవ అంతా పోలీస్ క్వార్టర్స్‌లో జరగలేదని ఈ సందర్భంగా వారు పోలీసులతో మొరపెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలోనే అంతా జరిగిందని వారు చెప్పారు.

రాజీవ్ కొట్టిన దెబ్బలకే చనిపోయింది

రాజీవ్ కొట్టిన దెబ్బలకే చనిపోయింది

రాజీవ్, శ్రవణ్‌లు కలిసి శిరీషను చంపేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు మొదటి నుంచి చెబుతున్నారు. గురువారం పోలీసులు కుకునూరుపల్లి తీసుకు వెళ్లినప్పుడు అదే చెప్పారు. రాజీవ్ కొట్టిన దెబ్బలకే చనిపోయిందని వారు వాపోయారు. ఆ దిశగా కూడా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారని తెలుస్తోంది.

ఆధారాలు చూపిన పోలీసులు

ఆధారాలు చూపిన పోలీసులు

సంఘటన పోలీస్ క్వార్టర్స్‌లో జరగలేదని, రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రాంతాన్ని శిరీష షేర్ చేసిందని ఈ సందర్భంగా తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో కాల్ లిస్ట్, మెసేజ్‌లు, ప్రింట్ ఆధారాలను వారికి పోలీసులు చూపించారు. అంతేకాదు, రెండ్రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ఇస్తామని చెప్పారు.

కఠినంగా శిక్షించండి

కఠినంగా శిక్షించండి

శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లు నిందితులు అని, వారికి కఠిన శిక్ష పడాలని ఈ సందర్భంగా బంధువులు పోలీసులను కోరారు. వారిని వదిలి పెట్టవద్దని మొరపెట్టుకున్నారు.

శిరీష ఏం చేసిందంటే..

శిరీష ఏం చేసిందంటే..

శిరీష తల్లిదండ్రులు, భర్త, ఇతర బంధువులు ఉదయం కుకునూరుపల్లికి వెళ్లారు. ఎస్సై క్వార్టర్స్‌లో జరిగిన సీన్ టూ సీన్ వారికి పోలీసులు వివరించారు. శిరీష ఆత్మహత్య చేసుకున్న రాత్రి కుకునూరుపల్లికి వచ్చిన శిరీష ఏం చేసిందన్న విషయమై, తమ విచారణలో తెలిసిన అంశాలను వారికి వివరించారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్‌కు శిరీష వెళ్లలేదని, హనుమాన్ ఆలయం వెనుక ఉన్న రిసార్ట్స్ కు ఆమెను బలవంతంగా తీసుకు వెళ్లారని వారు అంటున్న విషయం తెలిసిందే.

English summary
Beautician Sirisha's parents visited Kukunoorpally Police Station on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X