• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నయీం ఎన్‌కౌంటర్: నేటీకీ ఏడాది పూర్తి, 227 కేసులు, ఆ పేర్లను తప్పించారా?

By Narsimha
|

హైదరాబాద్:గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెంది సరిగ్గా ఇవాళ్టికి ఏడాది పూర్తైంది. గత ఏడాది ఇదే రోజున మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం మరణించాడు.

నయీం కుడి భుజం 'శేషన్న' జాడను పసిగట్టిన పోలీసులు?

సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, హత్యలు, బెదిరింపులకు పాల్పడినట్టుగా పలు కేసులు నయీంపై ఉన్నాయి. నయీం కేసులో ప్రధానంగా విన్పించిన రాజకీయనేతలపై ఎటువంటి చర్యలు లేవు. పోలీసుశాఖలో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సిట్ వ్యవహరించిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికారపార్టీకి చెందిన నేతల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందనే కారణంగానే కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయీం గురించి తెలియనివారు లేరు. అయితే నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నయీం గురించి తెలియనివారికి, తెలిసినవారికి కూడ ఇంకా అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రాజకీయనాయకులు, పోలీసు ఉన్నతాధికారులు నయీంతో అంటకాగారని సమాచారం. అయితే ఈ కేసులో పెద్ద తలకాయలను తప్పించి చిన్నవారిని బలిచేశారని విపక్షాలు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించాయి.

ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆడియో టేపులు బయటపడిన నేతలపై చర్యలు మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. నయీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులే ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడ మీడియాలో ప్రసారమయాయ్యాయి. అంతేకాదు సిట్ అధికారులు ఈ విషయమై కొందరిని ప్రశ్నించారు.

227 కేసులు నమోదు

227 కేసులు నమోదు

గ్యాంగ్‌స్టర్ నయీం హత్యకేసులో ఇప్పటికే ఏడాది పూర్తైంది. రాష్ట్ర వ్యాప్తంగా నయీం వ్యవహరానికి సంబంధించి 227 కేసులు నమోదైనట్టుగా సిట్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసులకు సంబంధించి 895 సాక్షులను విచారించినట్టు చెప్పారు.

  Congress MLA Jeevan Reddy Fires On KCR Govt Over Gangster Nayeem Case - Oneindia Telugu
   128 అరెస్ట్ చేసిన పోలీసులు

  128 అరెస్ట్ చేసిన పోలీసులు

  నయీం కేసులో ఇప్పటికే 128 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పెద్ద తలకాయలను వదిలేశారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అరెస్టు చేసినవారు కాకుండా మరో 109 మందిని కూడ తమ కస్టడీలోకి తీసుకొని విచారించినట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు.

  9 కేసుల్లోనే చార్జీషీట్ దాఖలు

  9 కేసుల్లోనే చార్జీషీట్ దాఖలు

  ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు పోలీసులు.ఇంకా 22 కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు సిట్ అధికారులు ప్రకటించారు. నయీం కేసులకు సంబంధించి విచారణ తుదిదశకు చేరుకొందని పోలీసులు వెల్లడించారు. నయీం గ్యాంగ్‌లోని 14 మందిపై పీడీయాక్ట్‌లు నమోదు చేశారు.

  నలుగురు పోలీసులపై చర్యలు

  నలుగురు పోలీసులపై చర్యలు

  నయీంతో అంటకాగినట్టు రుజువు కావడంతో నలుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకొన్నట్టు సిట్ ప్రకటించింది. మరో 4 పోలీసు అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నట్టు సిట్ పేర్కొంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  SIT have been arrested 128 members in Nayeem case from last one year.SIT was filed chargesheet in 9 cases, another 22 cases sIT will be filed chargesheet soon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more