హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్‌ కేసు: టాలీవుడ్‌కు చెందిన ఇద్దరి కీలక సమాచారం, ఎవరా ఇద్దరు?

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరి గురించి సిట్ అదికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. కెల్విన్, జీశాన్‌లతో ఉన్న సంబంధాలు తదితర విషయాలపై ఖచ్చితమైన ఆధారాలను సేక

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరి గురించి సిట్ అదికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. కెల్విన్, జీశాన్‌లతో ఉన్న సంబంధాలు తదితర విషయాలపై ఖచ్చితమైన ఆధారాలను సేకరించారని సమాచారం. అయితే ఈ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు తదుపరి కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. ఈ కేసులో ఆ ఇద్దరు సినీ ప్రముఖుల మెడకు ఉచ్చుబిగించేందుకు సిట్ అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

వెయ్యిమందికి నోటీసులు, ఆ పేర్లు బయటపెట్టొద్దని ఒత్తిడి: అకున్ సభర్వాల్వెయ్యిమందికి నోటీసులు, ఆ పేర్లు బయటపెట్టొద్దని ఒత్తిడి: అకున్ సభర్వాల్

డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు సీరియస్‌గా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విచారణ తుది దశకు చేరుకొంది.అయితే డ్రగ్స్ కేసులో అరెస్టైన కెల్విన్, జీశాన్‌తోపాటు ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తును చేస్తున్నారు.

డ్రగ్‌కేసు: భోజనం చేయని రవితేజ, కెల్విన్, జీషాన్ సంబంధాలపై ప్రశ్నలుడ్రగ్‌కేసు: భోజనం చేయని రవితేజ, కెల్విన్, జీషాన్ సంబంధాలపై ప్రశ్నలు

సిట్ విచారణకు హజరైన సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడ ఇంకా ఈ కేసులో కీలక విషయాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను బయటపెట్టకూడదని ఒత్తిడి ఉందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ప్రకటించడం గమనార్హం.

మరో వైపు ఈ కేసును మరింతలోతుగా విచారణ చేసేందుకుగాను అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు మూలాలను అన్వేషించి వాటిని సమూలంగా మార్చేందుకు వారు ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రభుత్వం కూడ ఈ విషయమై సానుకూలంగా ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు.

పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?

డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులు?

డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులు?


డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు చెందిన కీలకమైన ఆధారాలను సిట్ అధికారులు సంపాదించారని సమాచారం. వీరిద్దరూ కూడ డ్రగ్స్ వినియోగంతోపాటు విక్రయాలకు లేదా సరఫరాకు కూడ పాల్పడినట్టు అధికారులు సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది.అయితే డ్రగ్స్ బాధితులే కాదు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కూడ సాక్ష్యాలను సేకరించారని తెలుస్తోంది. ఈ సాక్ష్యాల ఆధారంగా చర్యలను తీసుకొనే అవకాశం లేకపోలేదు.

ఎవరా ఇద్దరు ?

ఎవరా ఇద్దరు ?

సినీ రంగానికి చెందిన 12 మందికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీచేసింది. అందులో ఇప్పటికే విచారణ తుదిదశకు చేరుకొంది. అయితే విచారణకు హజరైనవారు ఇచ్చిన సమాచారంతో పాటు అరెస్టైన కెల్విన్, జీశాన్‌తో పాటు ఇతరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై సిట్ అదికారులు ఓ అంచనాకు వచ్చారని తెలిసింది. నలుగురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ వాడే అలవాటు ఉందని, ఇప్పుడు వాటిని మానేశారని విచారణలో తేలిందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే డ్రగ్స్ ను గతంలో వినియోగించినవారెవరనే విషయాలను రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఉన్న సమాచారం, సాక్ష్యాల ఆధారంగా ఇద్దరిపై సిట్ అనుమానాలను వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. అయితే ఎవరు ఆ ఇద్దరు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

షూటింగ్‌ల సమయంలోనే

షూటింగ్‌ల సమయంలోనే

విదేశాల్లో షూటింగ్‌ల సమయంలోనూ, ఇండియాలో కూడ షూటింగ్ గ్యాప్‌లో ఓ ప్రముఖుడు డ్రగ్స్ వినియోగించే విషయాన్ని కొందరు సహచరులు గుర్తించారు. అయితే వారికి కూడ ఆయన డ్రగ్స్ ఆఫర్ చేస్తే మిగిలిన వారు తిరస్కరించినట్టు విచారణ సమయంలో సిట్ అధికారులకు సమాచారం అందిందని తెలుస్తోంది. అయితే మరో సినీ ప్రముఖుడికి కూడ డ్రగ్స్ వాడే అలవాటు ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై పక్కా ఆధారాలను సేకరించేందుకు సిట్ ప్రయత్నాలను చేస్తోంది.

పబ్‌లకు కూడ సరఫరా

పబ్‌లకు కూడ సరఫరా

అయితే సినీ రంగానికి చెందిన జూనియర్ నటుడిపై కూడ సిట్ అధికారులు పక్కాగా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పబ్‌లకు, క్లబ్‌లకు డ్రగ్స్ సరఫరాచేసేవారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.అయితే ఈ విషయమై విచారణ సందర్భంగా వచ్చిన సమాచారంతో పాటు ఇతరత్రా అంశాలపై పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు సిట్ అధికారులు.అయితే వీరిద్దరిపై ప్రస్తుతానికి సాక్ష్యాలను సేకరించడం పూర్తైతే కేసులను నమోదుచేసే అవకాశాలు కూడ లేకపోలేదని తెలుస్తోంది.

English summary
SIT officials trying to collect evidences in drug case .excise police arrested 20 members in this case. SIT identified that 2 persons involment in drug case, excise officers trying for collect evidences of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X