వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరీ కేంద్రంగా: సుబ్బరాజుకు సిట్ ఆఫర్, ఇక్కడా అదే కీలకం, అకున్ పక్కా ప్లాన్‌తో..

డ్రగ్ కేసులో నటుడు సుబ్బరాజును ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కేంద్రంగానే ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ కేసులో నటుడు సుబ్బరాజును ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కేంద్రంగానే ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారని తెలుస్తోంది. సుబ్బరాజును శుక్రవారం ఉదయం పది గంటల నుంచి విచారిస్తున్నారు.

మరికొందరు సినీ స్టార్లకు నోటీసులు! పూరీ 'గుట్టు' విప్పిన శ్యామ్మరికొందరు సినీ స్టార్లకు నోటీసులు! పూరీ 'గుట్టు' విప్పిన శ్యామ్

ఆ ఆధారాలతో..

ఆ ఆధారాలతో..

సిట్ అధికారులు బుధవారం పూరీని, గురువారం శ్యాం కే నాయుడును విచారించారు. వీరి విచారణలో వెలుగు చూసిన అంశాలు, వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. కెల్విన్‌కు పూరీతో గల సంబంధాలను ఆరా తీస్తున్నారని సమాచారం.

సుబ్బరాజు విచారణలోను సెల్ఫీయే కీలకం

సుబ్బరాజు విచారణలోను సెల్ఫీయే కీలకం

నటుడు సుబ్బరాజు విచారణలోను సెల్ఫీనే కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. కెల్విన్‌తో కలిసి పూరీ, శ్యామ్ కె నాయుడులతో పాటు సుబ్బరాజు కూడా సెల్ఫీలు దిగాడని, వీటిపై దర్యాఫ్తు బృంధం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
అకున్ సబర్వాల్ పక్కా ప్లాన్‌తో..

అకున్ సబర్వాల్ పక్కా ప్లాన్‌తో..

డ్రగ్స్ కేసులో సిట్ బృందం పక్కా ప్లాన్‌తో సినిమా తారలను విచారిస్తోంది. అకున్ సబర్వాల్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏ సినిమా తారను ఏ అధికారి ప్రశ్నిస్తారో.. అకున్ సబర్వాల్ చివరి వరకు చెప్పడం లేదని తెలుస్తోంది. తద్వారా విచారణలో పారదర్శకత పాటిస్తున్నారని అంటున్నారు. ఇంటరాగేషన్‌ను రెండు మూడు సెషన్స్‌గా విభజించారు. ఏ బృందంలో ఏ అధికారి ఉంటాడో చివరి దాకా తెలియనీయడం లేదు. ఇందుకు ఇరవై అయిదు మంది అధికారులను ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది.

దాని పైనా ప్రశ్నలు

దాని పైనా ప్రశ్నలు

డ్రగ్స్ కోసం పూరీ జగన్నాథ్ ఇంటర్నేషల్ సిమ్ వాడారని సిట్ దర్యాఫ్తు బృందం గుర్తించినట్లుగా తెలిసిన విషయం తెలిసిందే. కెల్విన్ - పూరీలు చాలాసేపు చాటింగ్ చేసుకున్నారని తేలిందని సమాచారం. దీనిపై సుబ్బరాజును అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

చెప్తే సరే, లేదంటే

చెప్తే సరే, లేదంటే

డ్రగ్ కేసులో నటుడు సుబ్బరాజును ప్రశ్నిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) అధికారులు మారిపోయారు. విచారణ అధికారి అకున్ సబర్వాల్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. చివరి వరకు విచారణ చేసే అధికారులు ఎవరో తెలియనీయడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగా సుబ్బరాజును విచారించే అధికారులు మారిపోయారు. తమ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెబితే విచారణ ఎక్కువసేపు ఉండదని అతనికి చెప్పారని తెలుస్తోంది. లేదంటే సుదీర్ఘంగా ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు.

పూరీతో బ్యాంకాక్ ఎందుకు వెళ్తారు, ఏం చేస్తారు?

పూరీతో బ్యాంకాక్ ఎందుకు వెళ్తారు, ఏం చేస్తారు?

డ్రగ్ అలవాటు ఉందా.. సుబ్బరాజును సిట్ అధికారులు అడిగిన తొలి ప్రశ్న ఇదే అని తెలుస్తోంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌తో మీకు మంచి స్నేహం ఉందా అని అడిగారని సమాచారం. పూరీతో తరుచూ బ్యాంకాక్ ఎందుకు వెళ్తుంటారని, అక్కడ ఏం జరిగిందో చెప్పాలని అడిగారని తెలుస్తోంది.

పూరీ గురించి తెలుసా, శాంపిల్స్ ఇస్తావా

పూరీ గురించి తెలుసా, శాంపిల్స్ ఇస్తావా

పూరీ జగన్నాథ్ అక్కడ వేరే ఫోన్ నెంబర్లు వాడినట్లు తెలుసా, తెలిస్తే ఆ నెంబర్లు చెప్పాలని దర్యాఫ్తు అధికారులు అడిగారని తెలుస్తోంది. కెల్విన్ తెలుసా, తెలిస్తే ఎలా పరిచయం అయ్యాడు, పరిశ్రమలో ఎవరెవరికి పరిచయం ఉంది, నీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు తీసుకోవచ్చా అని అడిగారని తెలుస్తోంది.

English summary
SIT (Special Investigation Team) is questioning Actor Subbaraju on director Puri Jagannath - Drug supplier Kelvin links.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X