వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్యాంగ్స్టర్ నయీం సెటిల్మెంట్స్: డీల్ చేసింది 1038ఎకరాలు.. సిట్ వెల్లడి
హైదరాబాద్: గతేడాది షాద్నగర్ వద్ద పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ నయీం ఆకృత్యాలపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సమగ్ర దర్యాప్తు జరుపుతోంది.
నయీం భూదందాలపై సిట్ తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించింది. నయీం 1038ఎకరాలను సెటిల్మెంట్లు చేసినట్టు తెలిపింది. ఇందులో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, సెటిల్ మెంట్ చేసిన భూములు ఉన్నాయని తెలిపారు.

రిజిస్ట్రేషన్ చేసిన భూములను రద్దు చేయడం ప్రభుత్వ పరిధిలో లేదని, కోర్టు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంటుందని సిట్ స్పష్టం చేసింది. అలాగే నయీం భూ వివాదాలపై మొత్తం 237 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.