హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తిరిగి ఎన్నిక, 'మా ఐక్యత ఇదీ'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీపీఎం జాతీయ మహాసభలు ఆదివారం నాడు హైద్రాబాద్‌లో ముగిశాయి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. మూడేళ్ళపాటు ఈ పదవిలో సీతారాం ఏచూరి కొనసాగనున్నారు. సుమారు 95 మందితో కేంద్ర కమిటీని మహసభ ఎన్నుకొంది.

సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్ 18 నుండి హైద్రాబాద్‌ ఆర్టీసీ కళ్యాణమండపంలో జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు ఏడువందలకు పైగా ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో సీపీఎం నిర్వహించతలపెట్టనున్న భవిష్యత్ కార్యాచరణపై ఈ మహసభల్లో చర్చించారు. రాజకీయ తీర్మానానికి మహసభ ఆమోదం తెలిపింది.

Sitaram Yechury re-elected as CPI(M) general secretary

గతంలో సీపీఎం కేంద్ర కమిటీలో సుమారు 92 మంది సభ్యులున్నారు. అయితే ఈ మహసభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్యను 95కు పెంచుతూ మహాసభ ఆమోదం తెలిపింది.దీంతో కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య 95కు చేరుకొంది.

గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి సీపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు , తెలంగాణలో పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడిగా ఉన్న ఎస్. వీరయ్య కూడ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉండేవాడు.

అయితే ఈ దఫా వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్యకు కూడ కేంద్ర కమిటీలో స్థానం దక్కింది.వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లాకు చెందిన చరుపల్లి సీతారాములుకు కూడ కేంద్ర కమిటీలో స్థానం దక్కింది.

కేంద్ర కమిటీలో మల్లు స్వరాజ్యం ప్రత్యేక ఆహ్వానితురాలిగా స్థానం దక్కింది.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఏపీ నుండి గఫూర్, పి. మధు, వి. శ్రీనివాసరావుకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరు రామయ్య ఎన్నికయ్యారు. కేంద్రకమిటీ 17 మందితో పొలిట్‌బ్యూరోను ఎన్నుకొంది. పొలిట్‌బ్యూరో సీతారాం ఏచూరికే మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు అప్పగించింది.

పార్టిని ముందుకు తీసుకెళ్ళేందుకు తాను ప్రయత్నిస్తానని సీతారాం ఏచూరి చెప్పారు. జాతీయ మహాసభల సందర్భంగా తీసుకొన్న సిపిఎం ఐక్యంగా ఉందని ఈ మహాసభ తేల్చి చెప్పింది. పార్టీ మహాసభ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఏచూరి చెప్పారు.పార్టీలో చీలిక వచ్చినట్టు వచ్చిన వార్తలపై సీతారాం ఏచూరిచ స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఆయన స్పందించారు. పార్టీలో నెలకొన్న అభిప్రాయాలపై చర్చించినట్టు చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొన్నామన్నారు. పార్టీ చీలిపోలేదన్నారు. తమ వైపు చూస్తే తాము ఎలా ఐక్యంగా ఉన్నామో తెలుస్తోందన్నారు.

ప్రజల కోసం సీపీఎం పోరాడుతూనే ఉంటుందన్నారు ఏచూరి. మా వైపు చూడండి మా ఐక్యత కన్పిస్తోందన్నారు. మేం మరింత బలోపేతం అయ్యాం. ముందు ముందు చాలా యుద్దాలున్నాయన్నారు ఏచూరి.

English summary
CPI(M) general secretary Sitaram Yechury got a second term for the top post after the new central commitee unanimously elected him.His three-year second term comes after huge speculations that the Politbureau Member Prakash Karat would push for some other candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X