ఆరుగురు సహా పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన హీరో!
భాగ్యనగరంలో ఓ డ్రగ్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ ముఠాలో నటుడు అభిషేక్ కూడా ఉండటం గమనార్హం.
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ డ్రగ్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ ముఠాలో నటుడు అభిషేక్ కూడా ఉండటం గమనార్హం. డ్రగ్ ముఠా కేసులో పోలీసులు అభిషేక్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆఫీస్ మిషనరీ మిస్యూజ్: కమిషనర్ పైన సిఐ సంచలన ఆరోపణలు
వీరిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన జేమ్స్... గార్మెంట్స్ పేరుతో వీసా సంపాదించాడు. హైదరాబాదులో తన మేనల్లుడుతో కలిసి డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు.
దక్షిణాఫ్రికా నుంచి కొకైన్‌ను ముంబైకి తీసుకు వచ్చి అక్కడి నుంచి హైదరాబాదుకు బస్సులో తరలిస్తున్నారు. కాగా, అభిషేక్ పలు సినిమాల్లో నటించాడు. నిందితులు అభిషేక్‌తో పాటు శ్రీనివాస్, నవీన్ అనే యువకులకు డ్రగ్స్ విక్రయించేవారు.
అభిషేక్ తాను కొకైన్ వాడటమే కాకుండా తనకు తెలిసిన వారికి కొకైన్ సరఫరా చేసేవాడు. ముఠా సభ్యుల నుంచి 370 గ్రాముల కొకైన్, 12 సెల్ ఫోన్లు, కారు, ద్విచక్ర వాహనంతో పాటు రూ.46వేలు స్వాధీనం చేసుకున్నారు.