• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒంటరిగా మహిళలు కన్పిస్తే వారేం చేస్తారంటే

By Narsimha
|

హైదరాబాద్ :ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు నిందితులను మూడు మాసాల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. దోపిడిలు, దొంగతనాలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతి చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు.అయితే హత్యకు గురైన మహిళ ఎవరనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు.

మద్యానికి బానిసగా మారిన కొందరు ముఠాగా ఏర్పడి దోపిడిలకు, దొంగతనాలకు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కల్లు కంపౌండ్లు, మద్యం దుకాణాలను అడ్డాగా ఎంచుకొని ఈ ముఠా తమ అరాచకాలకు పాల్పడుతోంది.

ఒంటరిగా వెళ్ళే వారిని లక్ష్యంగా చేసుకొని వారు దోపిడిలకు పాల్పడుతున్నారు.నిందితుల పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.చెడు అలవాట్లకు బానిసగా మారి ఈ ముఠా అనేక తప్పుడు పనులు చేస్తోంది.

మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి మూడు మాసాలైనా తప్పించుకొని తిరుగుతున్నారు నిందితులు. అయితే పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసును చేధించారు.ఈ కేసును చేధించిన పోలీసులను శంషాబాద్ డిసిపి పద్మజ అభినందించారు.

మూడుమాసాల తర్వాత మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

మూడుమాసాల తర్వాత మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

గుర్తుతెలియని మహిళ అత్యాచారంతో పాటు హత్యకు గురైంది.అయితే ఈ మహిళ హత్య చేసిన నిందితులు ఎవరనే విషయమై పోలీసులకు మిస్టరీగా మారింది. గుర్తుతెలియని మహిళ హత్యకు గురైన మూడు మాసాలైన పోలీసులకు చిన్న క్లూ కూడ దొరకలేదు. మహిళ హత్యకు గురైన ప్రాంతంలో ఉన్న సిసి టివి కెమెరాలో నిందితులకు సంబందించిన సమాచారం దొరకలేదు.దీంతో ఈ కేసును చేధించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ టీమ్ నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.

 పథకం ప్రకారంగానే గుర్తుతెలియని మహిళ హత్య

పథకం ప్రకారంగానే గుర్తుతెలియని మహిళ హత్య

కల్లు కాంపౌండ్ వద్దకు కల్లు తాగేందుకు వచ్చిన గుర్తుతెలియని మహిళను యూసుఫ్ మాట్లాడుకొన్నాడు. యూసుఫ్ ఆమెను ముసాక్ మహల్ ఫస్ట్ ఫ్లోర్ కు తీసుకెళ్ళాడు. అయితే యూసుఫ్ ను అతని స్నేహితులు అనుసరించారు. యూసుప్ తో పాటు అతని స్నేహితులు కూడ అక్కడికి వచ్చి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు.అయితే సామూహిక అత్యాచారం చేస్తుండడంతో బాధితురాలు అరిచింది. ఈ అరుపులకు భయపడిన నిందితులు ఆమెను హత్య చేశారు. పారిపోయే సమయంలో ఆమె ఒంటిమీద ఉన్న బంగారు ఆభరణాలను కూడ తీసుకొని పారిపోయారు.

పలు కేసులున్నా ముఠా

పలు కేసులున్నా ముఠా

తాళాలు వేసిన ఇళ్ళతో పాటు, అవకాశం దొరికితే దోపిడిలు, దొంగతనాలకు పాల్పడే వారు ఈ ముఠా సభ్యులు. ఎండి. యూసుఫ్, సయ్యద్ .నవాజ్, సయ్యద్ గఫార్, మహ్మద్ ముబీన్, అజం ఖాన్, మహ్మద్ అమీర్ లు ముఠాగా ఏర్పడి పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారు. ప్రధానంగా తమ జల్సాలకు, మద్యం అవసరాలకు అవసరమైన డబ్బుల కోసం దోపిడిలకు పాల్పడేవారు. ఈ ముఠా సభ్యులంతా మహిళలు ఒంటరిగా కన్పిస్తే అత్యాచారానికి పాల్పడేవారు. అవసరమైతే వారిని హత్య చేసేందుకు కూడ వెనుకాడరు.

మద్యం దుకాణాలే అడ్డా

మద్యం దుకాణాలే అడ్డా

ప్రతి రోజూ సాయంత్రం కల్లు కాంపౌండ్ వద్ద ఈ ముఠా పాగా వేస్తోంది. రాజేంద్రనగర్ ఏరియా పరిధిలోని కల్లు కాంపౌండ్ లు, మద్యం దుకాణాల వద్ద వారు ప్రతి రోజూ కల్లు తాగేందుకు వస్తుంటారు. చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటే మద్యం తాగుతారు. కల్లుకాంపౌండ్ లో కల్లు తాగేందుకు వచ్చే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని తమ పనులు చేసుకొంటారు. నిందితుల నుండి రెండు ఆటోలు, ఒక స్కూటీ, 18 సెల్ ఫోన్లు, మూడు చెవి రింగులు, రెండు టెలివిజన్లను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు చెప్పారు.ఈ నిందితులను అరెస్టు చేసినట్టు శంషాబాద్ పివి పద్మజ మీడియాకు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో శంషాబాద్ ఎసిపి ఆధ్వర్యంలో టీమ్ మంచి ప్రతిభను చూపిందని ఆమె ప్రశంసించారు.

English summary
six members team arrest police in unknown lady murder case.three months back unknown lady rape and murder case registered in rajendranagar police station limits.Police arrested yousuf, syed.Nawaz, syed.gaffar,md.Mubeen, azam khan & md.amir in this case.....2 autos,1 scooty,18cellphones,3 earrings & 2 televisions recovered from theirpossession.....all are residents of Bahadurpura &Rajendernagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X