హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డియర్ కేటీఆర్ అంకుల్..: ఆరేళ్ల చిన్నారి లేఖ, ఎంత గొప్ప మనసో!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడంలో ముందుంటారు. బహుశా.. అందుకేనేమో చాలామంది ట్విట్టర్ ద్వారా అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తుంటారు.

తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి సైతం ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ఓ లేఖ రాసింది. రోడ్లపై అడుక్కునే చిన్నారులను ఉద్దేశించి ఆ చిన్నారి రాసిన లేఖ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం రాసిందంటే..

six years old girl letter to minister ktr

'డియర్ కేటీఆర్ అంకుల్...నేను సుప్రియని. వయసు ఆరు సంవత్సరాలు ఆల్వాల్ హిల్స్ లోని సెయింట్ పీయస్ టెన్త్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను.

సుచిత్రా జంక్షన్ వద్ద పిల్లలు అడుక్కుంటున్నారు. వారికి వసతి సదుపాయం, ఆహారం, విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను' ఆ లేఖలో చిన్నారి పేర్కొంది.

చిన్నారి తండ్రి నాగేశ్వరరావు మంత్రికేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఈ లేఖను పోస్ట్ చేశారు. చిన్నారి లేఖపై స్పందించిన కేటీఆర్.. 'సార్, మీ పాపకు నీ తరుపున థ్యాంక్స్ చెప్పండి. చిన్నారి చెప్పిన పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ద తీసుకుంటాం. ఆ పిల్లల కోసం తన కిడ్డీ బ్యాంక్ డబ్బులు సైతం ఇస్తానని చిన్నారి చెప్పడం చాలా నచ్చింది.' అంటూ ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లో ఆ చిన్నారి లేఖ, దానికి కేటీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

English summary
A six years old girl wrote a letter to Telangana IT Minister KTR regarding begging children in city. She appealed KTR to take care of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X