వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డ్రగ్ రాకెట్: భర్త అకున్‌కు బెదిరింపులు, స్మితా సబర్వాల్ ఆగ్రహం?
డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు వచ్చాయి.దీనిపై ఆయన డిజిపికి ఫిర్యాదు చేసారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన డిజిపికి ఫిర్యాదు చేసారు. అలాగే, తన భద్రతపై ఎలాంటి భయం లేదని మీడియా ముఖంగా చెప్పారు.
అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు రావడంపై ఆయన సతీమణి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన స్నేహితులతో తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.
సమాజాన్ని, హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్ వ్యవహారంపై తన భర్త బాగా పని చేస్తుంటే, మంచి పని చేస్తుంటే ఇలా బెదిరింపులు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇలా హీనంగా బెదిరించడం శోచనీయం అన్నారని తెలుస్తోంది.
Comments
smita sabharwal akun sabharwal chandravadan kelvin calvin drug case sit puri jagannadh puri jagannath charmi kaur mumaith khan స్మితా సబర్వాల్ చార్మి డ్రగ్ కేసు సిట్ అకున్ సబర్వాల్ చంద
English summary
It is said that Smita Sabharwal is unhappy over threat calls to Excise enforcement director and her husband Akun Sabharwal.
Story first published: Wednesday, July 26, 2017, 18:52 [IST]