రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేక్ గ్యాంగ్ గుర్తుందా, పాములతో బెదిరించి రేప్‌లు?: 7గురికి జీవిత ఖైదు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్‌ను చాలా మంది మరిచిపోయే ఉంటారు. రెండేళ్ల క్రితం ఓ ఫామ్‌హౌస్‌లో పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్న ముఠా అది. హైదరాబాద్ పాతబస్తీలో కలకలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ అకృత్యాల కేసులో 8మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే.

చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 9మంది నిందితులను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు కట్టుదిట్టమైన భద్రతతో తీసుకువచ్చారు. స్నేక్ గ్యాంగ్‌పై జిల్లా కోర్టు విచారణ జరిపి ఎనిమిది మందిని దోషులుగా కోర్టు నిర్ధారించి 9వ, నిందితునిగా ఉన్న సలాం హండిల్‌ను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో అతనిపై వున్న కేసును కూడా కోర్టు కొట్టివేసింది.

నిందితులుగా పేర్కొన్న ఎనిమిది మంది ఫైసల్ దయాని, ఖాదర్ బరాక్, తయ్యబ్ అస్లం, మహమ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రాహిం, అలీ బరాక్‌లకు కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేస్తుంది. వీరిపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, హింస, పాముతో భయభ్రాంతులకు గురిచేయడం వంటి వాటికి సంబంధించి 2014 జూలై 31న పహాడీషరీఫ్ పోలీసులు సెక్షన్ 376,341,452,323,395,506,212,411 రెడ్‌విత్ 34 కేసులు నమోదు చేశారు.

యావజ్జీవ కారాగార శిక్ష

స్నేక్ గ్యాంగ్ నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం నాడు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఏ 1 నుంచి ఏ 7 వరకు నిందితులు అందరికీ జీవిత ఖైదును విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఏ8 నిందితుడికి మాత్రం సెక్షన్ 420 (8) కింద శిక్షను తగ్గించారు.

తనకు 65 ఏళ్ల వయస్సు ఉందని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏ8 నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఆబరణాలు దోచుకెళ్లడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా, స్నేక్ గ్యాంగ్ నిందితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులను దుర్భాషాలాడారు. సీవీ ఆనంద్ బయటకు వచ్చిన సమయంలో దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరవై నిమిషాల పాటు కోర్టు బయట ఉత్కంఠ కనిపించింది.

37 మందిపై పాములతో బెదిరించి రేప్?

37 మందిపై పాములతో బెదిరించి రేప్?

ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరపగా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో 37మంది మహిళలను పాములతో బెదిరించి అరాచకానికి పాల్పడినట్టు పోలీసులు అభియోగాలు మోపారు.

సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో...

సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో...

హైదరాబాద్ పహాడిషరీఫ్ పోలీసులు సామూహిక అత్యాచారానికి సంబంధించిన సరైన ఆధారాలను చూపించలేకపోవడంతో ఆ సెక్షన్‌ను కోర్టు తొలగించింది.

బాధితురాలు కూడా..

బాధితురాలు కూడా..

బాధితురాలు కూడా అత్యాచారం జరిగినట్లు కోర్టులో చెప్పలేకపోయింది. దీంతో ఎనిమిది మంది నిందితులకు పదేళ్లు, లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇలా బయటపడింది....

ఇలా బయటపడింది....

2014 జూన్‌ 31వ తేదీన పహాడీ షరీఫ్‌ ప్రాంతంలోని ఓ ఫాంహౌ్‌సలోకి నిందితులు చొరబడ్డారు. అక్కడ ఒంటరిగా ఉన్న ప్రేమికుల జంటపై దాడి చేశారని, ప్రేమికుల జంటను వివస్త్రలుగా మార్చారని, పాములతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు..

సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు..

సామూహిక అత్యాచారం ఘటనను సెల్‌ఫోన్లలో నిందితులు చిత్రీకరించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితులు పహాడీ షరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎనిమిది అంశాలపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

పలు ధఫాలుగా విచారణ..

పలు ధఫాలుగా విచారణ..

స్నేక్ గ్యాంగ్‌పై వచ్చిన ఆరోపణలపై పలు దఫాలుగా కోర్టు విచారణ జరిపింది. నిందితులపై నమోదు చేసిన అత్యాచారం అభియోగం న్యాయస్థానంలో రుజువు కాలేదు.

రుజువు కాకపోవడంతో...

రుజువు కాకపోవడంతో...

అత్యాచారం అభియోగాలు రుజువు కాకపోవడంతో లైంగిక వేధింపులు, దోపిడీ, నిర్భయ చట్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపింది.

రెండేళ్లుగా చర్లపల్లి జైలులో..

రెండేళ్లుగా చర్లపల్లి జైలులో..

రెండేళ్లుగా చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది నిందితులను మంగళవారం భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరు పరిచారు.

న్యాయవాదులో ఆందోళనతో...

న్యాయవాదులో ఆందోళనతో...

న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి మంగళవారం నిరసన తెలపడం వల్ల శిక్షలను ఖరారు చేయలేకపోయారు. బుధవారంనాడు వారికి శిక్షను ఖరారు చేస్తారు.

English summary
Two years back an incident of Snake gang revealed at Pahadi Shareef in Hyderabad of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X