హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పాముల కలకలం: రంగంలోకి పాములు పట్టేవాళ్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల అధకారిక నివాసాల సముదాయంలో పాముల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జూ సిబ్బంది గడిచిన మూడు రోజులుగా పాములు పట్టే పనిలో నిమగ్నమయ్యారు.

మినిస్టర్ క్వార్టర్స్‌లో పనిచేసే సిబ్బంది ఫిర్యాదుతో నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని పాములు పట్టేవాళ్లు రంగంలోకి దిగి పాముల వేట కొనసాగిస్తున్నారు.

ఇప్పటి వరకు రక్త పింజర, జెర్రిగొడ్డు, క్యాట్ స్నేక్ లాంటి విష సర్పాలను పట్టుకున్నారు. నాగుపాము, నల్ల త్రాచుల్లాంటి అత్యంత ప్రమాదకర పాములు కూడా మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సంచరిస్తున్నాయనే సమాచారం కూడా ఉండటంతో వాటికోసం గాలిస్తున్నారు.

snake

వరుస వాహనాలు ఢీ: 10మందికి గాయాలు

వాహనాలన్నీ వరుసగా ఒకదానికొకటి ఢీకొనడంతో 10 మంది గాయాలకు గురయ్యారు. గచ్చిబౌలిలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న బస్సు, ఆటో, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

English summary
Snakes are in Ministers querters in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X