వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికి వారే యమునా తీరే: తెలంగాణలో సీఎం పదవిపైనే కాంగ్రెస్ నేతల కన్ను

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అందరూ పెద్ద నేతలే.. ఎవరికి వారే యమునా తీరే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం కావాలని వారంతా కలలు కంటున్నారు. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ)ది. ఈ పార్టీలో దాదాపు డజన్ మంది సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అంతే కాదు హైదరాబాద్‌లోని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వీళ్లదే హల్‌చల్‌. సీనియర్ నేతలంతా సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటూ ఉత్సాహంగా హస్తినకు పరుగులు తీస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారు.

వారికి ధీటుగా ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పరుగులు తీస్తున్నారు. 'సందట్లో సడేమియా' అన్నట్లు సినీ కథా నాయిక, మాజీ ఎంపీ విజయశాంతి కూడా తానూ ఎవరికీ తీసిపోనంటూ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతల హడావుడి పెరిగింది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు ఊపందుకున్నాయి.

 So many leaders competition for CM post in TPCC

ఇప్పటిదాకా తెరవెనుక ఉన్న నేతలంతా ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. టీపీసీసీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా ముఖం చూపేందుకే ఇష్టపడని నేతలు.. ఇప్పుడు అందరి కంటే ముందే వచ్చి వాలుతున్నారు. మీడియా సమావేశాల్లో పాల్గొనేందుకు విపరీతమైన పోటీ పెరిగింది. ఏంటబ్బా అని ఆరా తీస్తే.. ఇంకేముంది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కదా అందుకే ఈ హడావుడి అని ఓ సీనియర్‌ ఎమ్మెల్యే చమత్కరించారు. 'నేను తప్ప మా ఎమ్మెల్యేలందరూ వీలైతే పీసీసీ అధ్యక్షుడు పదవి కానీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవో వస్తే బాగుండునన్న ఫీలింగ్‌లో ఉన్నారు. వీలైతే సీఎం పీఠానికి తక్కువవేమీ కాదన్న ధీమా మా వాళ్లలో ఉంది' అని ఆ ఎమ్మెల్యే చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం పీఠం ఎక్కడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎటూ రేసులో మొదటి స్థానంలో ఉంటారు కదా అని అడగ్గా 'భలేవారండీ. జానారెడ్డి తాను సీఎం పదవి తప్ప అన్నీ చేశాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిని చేపట్టాల్సిందేనని ఘంటాపథంగా చెపుతున్నారు కదా' అని అన్నారు సదరు ఎమ్మెల్యే.

 So many leaders competition for CM post in TPCC

సీఎం రేసులో వీరే..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందో రాదో కానీ.. వస్తే సీఎం కావాలని అనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా డజను మందికి పైనే ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ ఎటూ ఆ పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. కానీ ఎన్నికల వరకూ ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారా? అన్నది సీఎం పదవిపై కన్నేసిన వారి ఆశ. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను మార్చే అవకాశం లేదని ఢిల్లీ నుంచి లీక్‌లు వస్తున్నాయి. అయినా ఎవరి ప్రయత్నం వారిదే. ఉత్తమ్‌ను మారిస్తే తమకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కోమటిరెడ్డి బ్రదర్స్‌ (నల్లగొండ), దామోదర రాజనర్సింహ, జే గీతారెడ్డి (మెదక్‌), వీ హనుమంతరావు, సర్వే సత్యనారాయణ (హైదరాబాద్‌) ప్రయత్నిస్తున్నారు.

 So many leaders competition for CM post in TPCC

తాను ప్రయత్నం చేయకపోయినా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా, నిజాయితీ కలిగిన రాజకీయవాదిగా పీసీసీ పీఠమిస్తే సాధ్యమైనంత చేయగలనని జిల్లా కేంద్రమైన జగిత్యాల ఎమ్మెల్యే టీ జీవన్‌రెడ్డి ఆశిస్తున్నారు.
అయితే ఆయన ఈ విషయంలో లాబీయింగ్‌లకు దూరం. వీరిలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందన్న సంగతి పక్కన పెడితే.. సీఎం పదవికి తాము ఏ మాత్రం తీసిపోమన్నది వారి ధీమా! ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు ఎంత అవకాశం ఉంటుందో సీఎల్పీ నేతగా తనకు అంతే అవకాశం ఉంటుందని జానారెడ్డి కూడా చెబుతున్నారు. బహిరంగంగా అనకున్నా ఆయన వర్గీయులు ఈ మధ్య కాలంలో ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇంతేనా అంటే మరి రాజకీయాల్లో కురువృద్ధుడు జైపాల్‌రెడ్డి సంగతేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జైపాల్‌రెడ్డి ఒక్కరే సీఎం పీఠానికి అర్హులన్న అభిప్రాయం కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఉంది.

 So many leaders competition for CM post in TPCC

రేవంత్, విజయశాంతి కూడా..
టీడీపీలో ఉంటే ఎప్పటికీ సీఎం పీఠం దక్కదని భావించి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు సీఎం రేసులో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. రేవంతే కాబోయే సీఎం అంటూ ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో కార్యకర్తలు ప్లకార్డులు కూడా పట్టారు. రేవంత్‌కు ఉన్న జనాదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదన్న వాదన కూడా బయలుదేరింది. రేవంత్‌ హడావుడి ముగిసిందో లేదో ఇంతకాలం తెరచాటున ఉన్న సినీనటి విజయశాంతి కూడా ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తానూ ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకుంటానని ఆమె గంభీర ప్రకటన చేశారు. రాహుల్‌ కూడా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని ప్రచారం సాగుతోంది. పదవుల కోసం ప్రత్యేకించి గెలిస్తే సీఎం పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న హడావుడి.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
There is competition for CM Post in Telangana Congress party leaders. Seniors like VH, Sarve Satya Narayana to TPCC president Uttam Kumar Reddy, CLP leader Janareddy.. MLA's DK Aruna, J Geetha Reddy, Komati Reddy brothers and so many ex- ministers Damodar Raja Narasimha, S Jaipal Reddy and recently entrant Revant Reddy as well as Cini actor Vijaya Santi also in the fray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X