వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ఇండియా రిక్రూట్‌మెంట్: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ కావలెను

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: నాణ్యమైన వార్తలనందిస్తూ డిజిటల్ మీడియాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వన్ఇండియా పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వన్ఇండియాకు చెందిన వివిధ భాషలకు సంబంధించిన పోర్టల్స్‌లో సోషల్ మీడియా ప్రమోషన్ కోసం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను అత్యవసరంగా ఎంపిక చేయనుంది.

ఎంపికైన అభ్యర్థులు కంపెనీ నిర్ణయించిన ప్రాంతం నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జీతం 15వేల నుంచి 24వేల వరకు అభ్యర్థి అనుభవం, లాంగ్వేజ్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు సోషల్ మీడియాపై మంచి పట్టు, పరిజ్ఞానం ఉన్నవారుదరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ మీడియా స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి. ఆడియన్స్‌ను ఆకర్షించే గలిగేలా సోషల్ మీడియా ప్రమోషన్ చేయగలిగి ఉండాలి.

సోషల్ మీడియా ఛానల్స్ అయిన ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, పింట్‌రెస్ట్, లింక్‌డిన్ ఇన్‌స్టాగ్రామ్ మొదలైన వాటిలో వన్ఇండియా పోర్టల్స్ కాంటెంట్‌ను ఆకట్టుకునేలా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ సైట్లను సోషల్ మీడియాలో ఆకర్షించేలా ప్రమోషన్ చేసి వ్యూవర్స్‌ను పెంచాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

Social media executive for Oneindia

లైఫ్‌స్టైల్, ఆటోమోబైల్స్, టెక్నాలజీ, ఎంటైర్టేన్మెంట్, న్యూస్, ట్రావెల్, ఎడ్యుకేషన్, పర్సనల్ ఫైనాన్స్ కేటగిరీల్లో సోషల్ మీడియా నిపుణులకు ప్రాధాన్యత ఉంటుంది.

బాధ్యతలు:

అన్ని సోషల్ మీడియాలో ప్రమోషన్లను ఆసక్తిగా చేయగలగాలి. లక్ష్యాలను చేరుకోగలగాలి. సోషల్ మీడియా పేజీల లైక్స్, ఫాలోవర్లను పెంచాలి. డే టు డే బేసిస్ ఇది జరుగుతూనే ఉండాలి.

అంతేగాక, కంపెనీకి సంబంధించిన అన్ని టీంలతో సంప్రదింపులు జరుపుతూ కాంటెంట్‌ను సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా ప్రమోట్ చేయాలి. ఇలా నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవాలి.

సోషల్ మీడియాలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఉత్తమ వ్యూహాలతో సోషల్ మీడియా ప్రచారాలను కొనసాగిస్తుండాలి. అన్ని ఛానల్స్ కంటెంట్‌ను ప్రమోట్ చేసేందుకు సృజనాత్మకంగా ఒక వరుస వ్యాఖ్యం రాయగలిగి ఉండాలి.

సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం సృజనాత్మకతను జోడించాల్సి ఉంటుంది. అంతేగాక, పలు సందర్భాల్లో రీడర్స్ సందేహాలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.

అర్హతలు:

ఏ అభ్యర్థి అయిన 0-2సంవత్సరాల అనుభవం కలిగి ఉంటే సరిపోతుంది.

బీబీఏ/బీకామ్, బీఏ/ఎంఏ(ఇంగ్లీష్), బీఏ/ఎంఏ (తమిళం), బీఏ/ఎంఏ(మలయాళం), బీఏ/ఎంఏ (తెలుగు), బీఏ/ఎంఏ(కన్నడ), బీఏ/ఎంఏ
(హిందీ), బీఏ/ఎంఏ(బెంగాళీ), బీఏ/ఎంఏ(గుజరాతీ)లలో డిగ్రీ పొంది ఉండాలి.

మంచి రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై మంచి అవగాహన ఉండాలి. ఎస్ఈఓపై మంచి పరిజ్ఞానం ఉండాలి. కాంటెంట్‌ను ఎలా ప్రమోట్ చేస్తే వ్యూవర్స్ బాగా రిసీవ్ చేసుకుంటారో తెలిసి ఉండాలి. ఆన్‌లైన్ ప్రమోషన్లపై అవగాహన ఉండాలి. విషయాన్ని తొందరగా అవగతం చేసుకుని ముందుకు సాగే దృక్పథం ఉండాలి. రీడర్ల ఆసక్తిని అర్థం చేసుకోవాలి. మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.

ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషలపై అవగాహన ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హతగా భావించబడుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే వన్ఇండియాను సంప్రదించగలరు.

English summary
Social media executive for Oneindia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X