వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మకర సంక్రాంతి రోజు విపక్షాల భ్రాంతి తొలగాలి, సోషల్ మీడియాతో మున్సిపోల్స్‌లో ప్రచారం: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది సోషల్ మీడియా అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యతిరేక వార్తలు రాసినా.. సోషల్ మీడియా మాత్రం వాస్తవాన్ని ప్రతిబింబించిందన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని శ్రేణులకు మార్గదిర్గేనం చేశారు. 200 మంది మీడియా కార్యకర్తలు సహా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్

ఫేస్‌బుక్, ట్విట్టర్

ప్రస్తుతం ఒక టీవీ, పత్రికో చదివే పరిస్థితి లేదని.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా తమ ప్రచారం చేయాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అంశంపై ప్రతీరోజు సీఎం కేసీఆర్ కూడా సోషల్ మీడియాను చూస్తారని కేటీఆర్ గుర్తుచేశారు. వాస్తవానికి అన్నీ చోట్ల టీఆర్ఎస్ దూకుడు కనిపిస్తోందని.. కానీ మనం మాత్రం నిర్లక్ష్యం చూపించకుండా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

కోటలు దాటుతోన్న మాటలు..

కోటలు దాటుతోన్న మాటలు..

మున్సిపల్ ఎన్నికల్లోనే విపక్షాల మాటలు కోటలు దాటుతున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఏం జరిగిందో ఆ పార్టీలు తెలుసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ బాసలుు తెలంగాణ గల్లీలో ఉంటే.. బీజేపీ, కాంగ్రెస్ బాసులు ఢిల్లీలో ఉంటారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కిృశాంక్, జగన్, సతీశ్ రెడ్డి, దినేశ్ చౌదరి.. టీఆర్ఎస్ పార్టీని క్యాంపెయిన్ చేస్తారని చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే వారిని సంపద్రించాలని కోరారు.

సబ్జెక్ట్ పరంగా..

సబ్జెక్ట్ పరంగా..

తమను దూషించినా సంస్కారంగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. సబ్జెక్టుపరంగా వారికి బుద్దిచెప్పాలన్నారు. సోషల్ మీడియాలో శ్రీదేవి, సుశీల కూడా యాక్టివ్‌గా ఉన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. మకర సంక్రాంతి రోజున ప్రతిపక్షాల భ్రాంతి తొలగాలి.. వినూత్న రీతిలో ప్రచారం చేయాలని శ్రేణులను కోరారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. 90 నుంచి 95 శాతం పనులు పూర్తయ్యాయని.. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో నీరు రాకుంటే దానిని ఫోటోలు తీసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

English summary
social media through trs municipal campaign trs working president ktr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X