హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.8 లక్షలు తీసుకొని, పెళ్లి చేసుకుంటానని మోసం: సాఫ్టువేర్ కంపెనీ సీఈవో అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమె దగ్గర నుంచి రూ.8 లక్షలు తీసుకొని మోసం చేసిన ఓ సాఫ్టువేర్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడిని రిమాండుకు తరలించారు.

మాదాపూర్ డాక్టర్స్ కాలనీలో ఉండే హేమంత్ కుమార్ అనే ముప్పై ఏళ్ల యువకుడు అయ్యప్ప సొసైటీ రోడ్డులో ఉన్న ఓ ఐటీ కంపెనీ సీఈవో. అదే కంపెనీలో ఖమ్మంకు చెందిన యువతి సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

ట్రిపుల్ మర్డర్స్: అపర్ణను వదిలేయమని యామిని, మరొకరితో సన్నిహితంగా.. సహజీవనంపై మధు ట్విస్ట్ట్రిపుల్ మర్డర్స్: అపర్ణను వదిలేయమని యామిని, మరొకరితో సన్నిహితంగా.. సహజీవనంపై మధు ట్విస్ట్

Software company CEO arrested on cheating charge

పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెను నమ్మించాడు. దాదాపు రెండేళ్ల క్రితం అంటే 2016 మార్చిలో అతను రూ.8 లక్షల నగదును ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె డబ్బు తిరిగి ఇవ్వలేదు.

ఆమె అడిగితే తప్పించుకు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల ఆమె మరోసారి అతనిని డబ్బుల గురించి, పెళ్లి గురించి నిలదీసింది. దీంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేయగా, మంగళవారం అతనిని అరెస్టు చేశారు.

English summary
Software company CEO arrested in Hyderabad on cheating charge on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X