వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ.. కోట్ల వేతనాలు ఎగవేత!

|
Google Oneindia TeluguNews

బంజారాహిల్స్ : దాదాపు కోటి రూపాయలకు పైగా వేతనాలను ఎగ్గొట్టి.. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. నెలన్నర రోజులుగా వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తూ వస్తోన్న ఉద్యోగులకు ఏదో ఒకటి చెప్పి.. సాగదీస్తూ వచ్చిన కంపెనీ గురువారం నాడు బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు ఉద్యోగులు.

వివరాల్లోకి వెళ్తే.. బంజరాహిల్స్ రోడ్డు నం.2లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ లిమిటెడ్ అనే కంపెనీలో దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఉద్యోగులెవరకీ వేతనాలు ఇవ్వలేదు కంపెనీ యాజమాన్యం. సుమారుగా రూ.1.25 కోట్లను యాజమాన్యం ఉద్యోగులకు బకాయిపడింది. వేతనాల గురించి ఎప్పుడూ ఆరా తీసిన నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తూ వచ్చారు సీఈవో శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల.

software employees filed case on vanco global tech

ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం ఉద్యోగులంతా ఆందోళన చేసి.. యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో గురువారం నాడు వేతనాలు చెల్లించడానికి అంగీకరించారు. ఇదే క్రమంలో గురువారం నాడు ఆఫీస్ కు వెళ్లిన ఉద్యోగులందరు సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి విషయంపై ఫిర్యాదు చేశారు.

English summary
Vanco Global tech A Software company was cheated the employees with out giving salarys. atlast company was shuttered down then employees approached police for justice
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X