హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జవాన్ల త్యాగం వృథా కాదు...ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదొర్కొనే సత్తా ఉంది: భదౌరియా

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: చైనా ఆగడాలు ఎంతో కాలం సాగవని హెచ్చరించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాదులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పిన భదౌరియా... చైనా రెచ్చగొడితే మాత్రం వెనకడుగు వేసేది లేదని చెప్పారు. ఎంతసేపూ భారత్ శాంతి మంత్రాన్నే పాటిస్తుందని చెప్పారు.

గాల్వాన్ ఘటనలో భారత జవాన్ల త్యాగం వృథా కాబోదని చెప్పారు. ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా చైనా వాటిని ఉల్లంఘించి భారత జవాన్లపై దాడి చేయడం సహించరానిదని భదౌరియా చెప్పారు. ఇక సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం ఆర్మీలు చేపడుతున్నాయని చెప్పారు. ఇక సరిహద్దుల్లో త్రివిధ దళాలకు చెందిన సైనికులు సన్నద్ధంగా ఉన్నారని ఎలాంటి సవాళ్లు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లడాఖ్‌లో జరిగిన ఘటన కు రియాక్ట్ అయ్యేందుకు చాలా తక్కువ సమయం ఉన్నిందని చెప్పారు.

Soldiers sacrife will not go in vain,we are prepared for any contingency:IAF Chief

Recommended Video

Watch Indian Navy Salutes Tribute to Corona Warriors on Land, Air and Sea

వాస్తవ నియంత్రణ రేఖ వద్దే కాదు ఇతర సరిహద్దుల్లో కూడా గస్తీని పెంచామని చెప్పిన భదౌరియా... చైనాకు సంబంధించి అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నామని చెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ వినియోగం చాలా అవసరమని భావిస్తున్నట్లు చెప్పిన భదౌరియా ... మంచి సమయం కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. సరిహద్దుల్లో అప్రమత్తతో ఉండటమే కాకుండా బలగాలను మరింత పెంచామని చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న భదౌరియా కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు.

English summary
All efforts are underway to ensure that the current situation at the Line of Actual Control is resolved peacefully, Indian Air Force Chief, R K S Bhadauria said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X