వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతంత్ర్య దినోత్సవం: ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ రూల్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 72వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల కోసం భారతదేశం ముస్తాబు అయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్ర్యం లభించింది. సిపాయిల తిరుగుబాటు మొదలు ఎందరో పోరాటం కారణంగా భారతమాత స్వేచ్ఛా గాలి పీల్చుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాలా లజపతి రాజ్ వంటి ఎందరో పోరాటం చేశారు.

72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు. భారతదేశంలో బ్రిటిషర్లు దాదాపు 335 సంవత్సరాలు ఆధిపత్యం చలాయించారు లేదా పాలించారు. 17వ శతాబ్దం నుంచి ఇరవయ్యో శతాబ్దం వరకు అంటే 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం వచ్చే వరకు వారి పాలనలో ఉన్నాం.

Some Facts You Must Know About Indias Freedom Struggle

1612లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 18వ శతాబ్ధంలో మొఘలుల శక్తి క్షీణించడంతో పరిస్థితి మారింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాలును గెలుచుకోవడం మొదలు 1858 వరకు కంపెనీ భారత దేశాన్ని పాలించింది. ఆ తర్వాత నుంచి 1947 వరకు బ్రిటీష్ రాజ్ పరిపాలనలో భారత్ ఉంది.

20 అక్టోబర్ 1773 నుంచి 15 ఆగస్ట్ 1957 వరకు మొత్తం 44 మంది బ్రిటిష్ ఆఫీసర్లు.. గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాగా పాలన చేశారు. మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హాస్టింగ్స్. చివరి గవర్నర్ జనరల్ లూయీస్ మౌంట్‌బాటెన్. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా రాజ్యాంగం తయారుకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1950 జనవరి 26న మన దేశపు రాజ్యాంగం అమలైంది.

English summary
The history of the British Raj refers to the period of British rule on the Indian subcontinent between 1858 and 1947. The system of governance was instituted in 1858 when the rule of the East India Company was transferred to the Crown in the person of Queen Victoria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X