• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిన్నాన్న కూతుళ్లనూ వదల్లేదు, చెల్లెలు అక్రమ సంబంధం: 'నయీమ్‌' దుర్మార్గాల్లో మరిన్ని సంచలనాలు

|
  చిన్నాన్న కూతుళ్లనూ వదల్లేదు, చెల్లెలు అక్రమ సంబంధం: 'నయీమ్‌' దుర్మార్గాల్లో సంచలనాలు | Oneindia

  హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీమ్‌ దురాగతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, భూదందాలు.. ఇలా అంతూ పొంతూ లేని నేరాలతో రెచ్చిపోయిన నయీమ్‌ అభ శుభం తెలియని బాలికలతో తన పైశాచిక కోరికలు తీర్చుకునేవాడు.

  చదువు చెప్పిస్తానని తీసుకువచ్చి ఎంతోమంది బాలికలకు నయీమ్‌ లైంగికంగా నరకం చూపించాడు. చెప్పిన మాట వినకపోతే వారిని చావబాదడం, నిద్ర మాత్రలు మింగించడం, మిర్చి జ్యూస్ తాగించి పైశాచిక ఆనందం పొందడం నయీమ్‌ వికృత పోకడలకు నిదర్శనం. నయీమ్‌ అత్త, భార్య, అక్క, మేనకోడలు ఈ దారుణాలకు తోడ్పడ్డారు.

  చదువు, ఉద్యోగం పేరుతో:

  చదువు, ఉద్యోగం పేరుతో:

  నయానో భయానో నయీమ్‌ కొంతమంది అమాయక తల్లిదండ్రులను ఒప్పించి వారి కూతుళ్లను తన ఇంటికి తీసుకొచ్చేవాడు. చదువు చెప్పిస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించేవాడు. కానీ తీరా ఇంటికి తీసుకెళ్లాక తన పైశాచికత్వాన్ని బయటపెట్టేవాడు. లైంగికంగా చిత్రహింసలు పెట్టడంతో పాటు, ఒప్పుకోకపోతే కాలితో నిర్దాక్షిణ్యంగా గొంతుపై తొక్కి చంపేసేవాడు. తాను ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలను వెంటపెట్టుకునే వెళ్లేవాడు.

  షరీఫ్ హత్య:

  షరీఫ్ హత్య:

  2006లో నయీమ్‌ తన దగ్గరి బంధువులకు చెందిన నలుగురు బాలికలను చదువు పేరుతో ఇంటికి తీసుకొచ్చాడు. వారిని లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టాడు. బాలికలను చిత్రహింసలు పెట్టడం చూడలేక నయీమ్‌ అనుచరుడు షరీఫ్ వారిని కాపాడాలనుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న నయీమ్‌ అతన్ని దారుణంగా హత్య చేశాడు.

  గోవాకు బాలికలను తీసుకెళ్లి:

  గోవాకు బాలికలను తీసుకెళ్లి:

  2008లో గోవాలో నయీమ్‌ ఇల్లు కొనుగోలు చేశాడు. హైదరాబాద్ లోని వైట్ హౌజ్ ఇంట్లో ఉన్న ఆరుగురు 14ఏళ్ల బాలికలను తరుచూ అక్కడికి తీసుకెళ్లి లైంగిక కోర్కెలు తీర్చుకునేవాడు. నయీమ్‌ తో గోవా వెళ్లేందుకు వారు ఒప్పుకోకపోతే అతని భార్య, అక్క వారిని విపరీతంగా కొట్టి బలవంతంగా పంపించేవారు. 2010లో బంధువుల 17ఏళ్ల అమ్మాయిపై నయీమ్‌ అత్యాచారం చేశాడు.

  చిన్నాన్న కూతుళ్లనూ వదల్లేదు:

  చిన్నాన్న కూతుళ్లనూ వదల్లేదు:


  నయీమ్‌ మదమెక్కిన మృగం అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. సొంత చిన్నాన్న కూతుళ్లను కూడా అతను వదల్లేదు. చిన్నాన్న కూతుళ్లయిన ముగ్గురు బాలికల(12ఏళ్లు)ను మూడు రోజుల పాటు నిర్బంధించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

  2012ఆగస్టులో షాద్ నగర్ లోని ఇంట్లో 12 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచి మరీ అత్యాచారం చేశాడు. అదే సంవత్సరం నవంబర్‌లో మరో 14 ఏళ్ల బాలికను రెండు రోజుల పాటు లైంగికంగా వేధించాడు.

  నయీమ్‌ సోదరి అక్రమ సంబంధం:

  నయీమ్‌ సోదరి అక్రమ సంబంధం:

  నయీమ్‌ అనుచరుడు కృష్ణ అలియాస్‌ బాషాతో సలీమా అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పటికే నయీమ్‌ దురాగతాలపై తీవ్ర అసహనంతో ఉన్న సలీమా భర్త కొండా విజయ్ కుమార్.. అలియాస్ నదీమ్ గ్యాంగ్ ను వీడాలనుకున్నాడు. విజయ్ బయటికెళ్లిపోతే నిజాలు బయటపడుతాయన్న భయంతో సలీమా, ఇతర కుటుంబ సభ్యులు కలసి అతడిని హతమార్చారు. సలీమానే అతని ముఖానికి చున్నీ బిగించి చంపేయడం గమనార్హం.

  18ఏళ్ల అనామికపై కూడా:

  18ఏళ్ల అనామికపై కూడా:

  అలకాపురి కాలనీలోని తన ఇంట్లో అనామిక అనే 18ఏళ్ల బాలికపై జులై 24, 2015న నయీమ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించలేదన్న కోపంతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు రాత్రి తుక్కుగూడలో నయీమ్‌ తమ్ముడి కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ ఉండటంతో.. అనామికకు నిద్రమాత్రలు మింగించి, ఓ గదిలో పడేసి కుటుంబమంతా వెళ్లిపోయారు.

  సాయంత్రం తిరిగి వచ్చేసరికి అనామిక కదలకుండా ఉండటంతో చనిపోయిందని భావించారు. దీంతో ఆమె శవాన్ని పారేసేందుకు యత్నించగా.. ఆమె ఇంకా ప్రాణంతోనే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అత్యంత క్రూరంగా ఆమె పొట్టపై కాళ్లతో తొక్కి, గొంతు నులిమి నయీమ్‌ ఆమెను హత్య చేశాడు. ఆపై డ్రైవర్ తో కలిసి ఇంటికి 2కి.మీ దూరంలో ఉన్న పొదల్లో మృతదేహాన్ని దహనం చేశారు.

  వాళ్ల ఆచూకీ తెలియదు:

  వాళ్ల ఆచూకీ తెలియదు:

  2014లో నయీం ఇద్దరు బాలికలను తీసుకుని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడు. అయితే తిరిగి వారు హైదరాబాద్ రాలేదు. నయీం వారిని హత్య చేశాడా? లేక అక్కడి అనుచరుల వద్ద వదిలి వచ్చాడా? అన్నది ఇప్పటికీ తేలలేదు.

  2016 ఫిబ్రవరిలో గోవాలోని ఇంట్లో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆమెను కూడా దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల తాజా విచారణలో తేలింది.

  English summary
  Some more sensations of Nayeem depravity are came into light. Police still interrogating Nayeem supporters
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X