వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమజంటపై దాడి .. యువకుడి పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కులం వేరో, మతం వేరో తెలియదు కానీ .. మరో ప్రేమ జంటపై దాడి జరిగింది. నగర నడిబొడ్డున కత్తులతో విరుచుకుపడ్డారు దుండగులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా .. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

some one attack by couple

జంటపై దాడి ..

సంగారెడ్డికి చెందిన యువకుడు, హైదరాబాద్ బోరబండకు చెందిన యువతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దల వద్దనడంతో పెళ్లి కూడా చేసుకున్నారు. తమ పెళ్లిని ఇష్టపడని పెద్దలు .. దాడి చేస్తారని వారు ముందే ఊహించారు. ఎస్ ఆర్ పోలీసు స్టేషన్ వద్దకొచ్చి తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతే తిరిగి బయటకు వెళ్లారు. రాత్రి 8 గంటలకు దుండగులు విరుచుకుపడ్డారు.

వాహనంలో వెళ్తుండగా దాడి ..
తిరిగి వాహనంలో వెళ్తుండగా దుండగులు విరుచుకుపడ్డారు. జంటపై విచక్షణరహితంగా దాడి చేశారు. యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆ యువజంట వివరాలు తెలియాల్సి ఉంది. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరి కులం వేరవడంతో దాడికి తెగబడినట్టు సమాచారం. కాలం మారుతున్న కలం పేరుతో దాడులు ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కులం, మతం పేరుతో చంపడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు మరిన్ని ఘటనలు జరిగేందుకు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పేరెంట్స్ పిల్లల మనసులు తెలుసుకొని .. మసలుకోవాలని కోరుతున్నారు. లేదంటే మరికొన్ని ప్రేమ పేరుతో దాడులు జరుగుతాయని భయాందోళనకు గురవుతున్నారు.

English summary
A young man from Sangar Reddy, woman from Hyderabad borabandha was in trouble. At the time of the elders, they also got married. They predicted that they would attack the unmarried adults who did not like their marriage. Asked the police to come to the police station and save them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X