వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హృదయ విదారకరం: రూ.20 వేలు తీసుకొని, తల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కుమారుడు..

|
Google Oneindia TeluguNews

ఆధునిక పోకడే, సమాజం పొంతనో తెలియదు కానీ.. విలువలు ఉండటం లేదు. పెద్దలంటే గౌరవించడం కాదు కన్న తల్లిదండ్రులను పట్టించుకొని పరిస్థితి. అలనా పాలనా చూడటం లేదు. ఇక మన పుత్రరత్నం అయితే ఒక ఆకు ఎక్కువే చదివాడు. నవమాసాలు మోసిన తల్లి యాచించి కూడబెట్టిన నగదు తీసుకోవడమే కాదు.. ఆస్పత్రిలో చూపించమని అడిగితే.. మనసే లేక రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈ హృదయ విదారకర ఘటన హైదరాబాద్ శివారులో జరిగింది. ఆ కసాయి చేసిన పనిని ప్రతీ ఒక్కరు తిడుతున్నారు.

ఇదీ విషయం..

ఇదీ విషయం..


ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఆ వృద్దురాలు గత కొంతకాలం నుంచి మేడ్చల్ జిల్లా అన్నొజిగూడలో ఉంటున్నారు. పిల్లలు పట్టించుకోకపోవడంతో అక్కడే యాచించి మరీ గడిపేది. కానీ పేగు బంధం కొట్టుకుంటోంది కదా.. అలా రూ.20 వేల కూడబెట్టి మరీ కుమారుడి వద్దకొచ్చింది వృద్దురాలు. అనారోగ్యం బారినపడటంతో ఆమె కుమారుడి వద్దకు రాక తప్పలేదు.

రూ.20 వేలు తీసుకొని..

రూ.20 వేలు తీసుకొని..


తల్లి వచ్చిందంటే కుమారుడు, కోడలు ఏమీ అనలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాతే వారికి ఆమె తాను రెక్కలు ముక్కలు చేసుకొని కూడబెట్టిన రూ.20 వేలను ఇచ్చింది. అయితే ఆమె అలానే ఉంటే ఏమవుతుందో తెలియదు కానీ.. ఒంట్లో బాగాలేదు అని చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరడంతో సరేనని కుమారుడు, కోడలు నమ్మబలికాడు. ఆస్పత్రికి తీసుకెళతామని బయల్దేరారు. కానీ వేరే మార్గంలో తీసుకెళ్లారు. ఆ రోడ్ కాదు అని చెప్పిన వినిపించుకోలే. చివరికీ బోనగిరి బస్టాండ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్దురాలు రోదన అరణ్య రోదనే. తాను కూడబెట్టిన నగదును కుమారుడికి ఇచ్చానని.. తీరా తనను మోసం చేశారని వాపోయింది.

Recommended Video

China Trying To Profit Amid Crisis, China Game Plan in India
3 రోజులుగా టీ స్టాల్ వద్ద..

3 రోజులుగా టీ స్టాల్ వద్ద..

బోనగిరి టీ స్టాల్ వద్ద గత మూడురోజుల నుంచి వృద్దురాలు ఉంది. దీంతో స్థానికులు ముందుకొచ్చారు. పేగుతెంచుకొని పుట్టిన కుమారుడు కాదన్నా.. బోనగిరి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సాయంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వృద్దురాలికి ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు, బంధువులకు పోలీసులు పిలిచారు. తల్లి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు.

English summary
80 year old ailing woman was dumped on the roadside by her son and daughter-in-law after she habded over to them rs 20,000 that she had earned begging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X