గ్రాండ్ గా సోనియా గాంధీ జన్మదినోత్సవం.!రేవంత్ ఇలాకాలో ప్రతిష్టాత్మకంగా డిజిటల్ మెంబర్షిప్.!
కొడంగల్/హైదరాబాద్ : గురువారం 9వ తేదీ సోనియమ్మ జన్మ దినోత్సవాన్ని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తొలి ప్రకటన వచ్చిన రోజు అదే రోజు కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ప్రారంభించడం గర్వంగా ఉందని పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఈ డిజిటల్ మెంబర్ షిప్ ను ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంటు నియెకవర్గం పరిదిలోని కందుకూరు మండలం కేంద్రంలో పార్లమెంట్ ఇంచార్జి వేముల నరేందర్ రెడ్డి డిజిటల్ మెంబర్ షిప్ ను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సంకినేని సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగా రెడ్డి, టీపిసిసి సెక్రెటరీ అమరేందర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం నాయకులు దేవ భాస్కర్ రెడ్డి, కందుకూరు మండల అధ్యక్షులు కృష్ణ నాయక్ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులు కందుకూరు మండల్ ముఖ్య నాయకులు బూత్ కమిటీ నాయకులు కార్పొరేటర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ లు మహిళా అధ్యక్షులు మహిళా నాయకులు మాజీ సర్పంచులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్యూఐ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమానికి ఆహ్వానితులుగా ఏఐసీసీ నాయకులు ప్రవీణ్ చక్రవర్తి, హర్కర వేణుగోపాల్, శివసేనారెడ్డి, దీపక్ జాన్, చామల కిరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు
