వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా పిలిచారు, కానీ నేనే వెళ్లలేదు, ఎందుకంటే..: గవర్నర్‌తో కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికల విషయమై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన విందు సమావేశానికి తమకు కూడా ఆహ్వానం అందిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నర్సింహన్‌కు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల విషయమై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన విందు సమావేశానికి తమకు కూడా ఆహ్వానం అందిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నర్సింహన్‌కు తెలిపారు. అయితే, తాను ఈ సమావేశానికి హాజరుకాలేదని అన్నారు.

రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైనా.. కాకపోయినా తమ మద్దతు ఎన్డీయేకేనని కేసీఆర్ స్పష్టం చేశారు. లౌకిక అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకగ్రీవ ఎన్నికకు తాము కూడా మద్దతిస్తామని కాంగ్రెస్, విపక్షాలు కూడా ప్రకటించాయని కేసీఆర్ గుర్తు చేశారు.

Sonia Gandhi invited me to attend lunch party, says KCR

గవర్నర్‌తో ఆదివారం దాదాపు రెండుగంటలపాటు సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికతోపాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు.
జూన్ 2వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మూడవ అవతరణ వేడుకలకు హాజరుకావాలని ఈ సందర్భంగా గవర్నర్‌ను సీఎం కోరారు.

రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో 111 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తమ సర్వే వివరాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా కొంచెం కష్టపడితే 113 సీట్లు కూడా రావచ్చని సర్వేలో తేలిందని చెప్పారు. కాగా, ఒకే వారంలో కేసీఆర్ రెండుసార్లు గవర్నర్‌ను భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Sunday said that he was invited by Congress Party president Sonia Gandhi to attend lunch party in her house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X