కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హృదయ విదారకరం: కన్న తల్లిని ఇంట్లోకి రానీయని కర్కశులు, మహారాష్ర్ట నుంచి వచ్చిందని..

|
Google Oneindia TeluguNews

పేగు తెంచుకొని పుట్టిన కొడుకులే కాదన్నారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చినందున ఇంట్లోకి రానీయలేదు. పెద్ద కుమారుడు అంతే.. ఇక చిన్న కుమారుడి సంగతి చెప్పక్కర్లేదు. ఎక్కడ తన ఇంటికి వస్తుందోనని తాళం వేసుకొని మరీ వెళ్లాడు. చివరికీ మున్సిపల్ అధికారులు కలుగజేసుకోవడంతో.. దారిలోకి వచ్చారు. కుమారులే ఇంట్లోకి రావొద్దని మాతృమూర్తి అన్న ఘటన కరీంనగర్‌‌లో చోటు చేసుకుంది.

Recommended Video

Sons Refuse to Allow 80-year-old Mother Into House out Of COVID 19 Fear

కరీంనగర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్దురాలు మహారాష్ట్ర వెళ్లారు. తిరిగి వద్దామనుకునేలోపు.. లాక్ డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. షోలాపూర్‌లో తన బంధువుల వద్ద ఉన్నారు. నిబంధనలు సడలించడంతో.. శుక్రవారం కరీంనగర్ చేరుకున్నారు. దీంతో సీన్ మొదలైంది. ఆమె చేరుకున్నాక.. ఇంట్లోకి రావొద్దని కుమారులు అంటారు. దీంతో ఏం చేయాలో ఏం చెప్పాల్లో ఆ తల్లికి తెలియలేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే రావొద్దని చెప్పడంతో ఏం చేయాలోతోచలేదు.

 Sons refuse to allow 80-year-old mother into house..

మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడినుంచి రావడంతో.. ఆమెకు కూడా వైరస్ ఉందా అని కుమారులు భావించారు. కానీ పెద్ద కుమారుడు రావొద్దని చెప్పాడు. చిన్న కుమారుడి వంక చూడగానే అతను ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే తనకేం కాలేదు అని.. బాగానే ఉన్నానని ఆ వృద్దురాలు చెప్పింది. కానీ వారు వినిపించుకోలేదు. చివరికి డివిజన్ మెంబర్ ఏడ్ల అశోక్, మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. పెద్ద కుమారుడికి సర్ది చెప్పడంతో.. ఇంట్లోకి రానీచ్చారు. సీనియర్ సిటిజన్లకు కరోనా వైరస్ పరీక్షలు చేస్తారని.. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ చేస్తారని పేర్కొన్నారు.

English summary
80-year-old woman was allegedly not allowed into their house in Telangana's Karimnagar area on Friday by her sons out of Covid-19 fear as she returned from Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X