• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రియల్ హీరో సోనూ సూద్ కోసం అభిమాని సాహసం-కాళ్లకు చెప్పులు లేకుండా 700కి.మీ పాదయాత్ర

|

సోనూ సూద్... ఏడాది కాలంగా ఎంతోమంది కష్టాలను తీరుస్తూ,కన్నీళ్లను తుడుస్తున్న రియల్ హీరో. సంపాదించినదంతా ఖర్చు పెట్టి మరీ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న గొప్ప మనసున్నవాడు. కరోనా వేళ ఆగమైన వలస కూలీలను పట్టించుకునేందుకు ఎవరూ ముందుకు రాని వేళ... సోనూ ఒక్కడే వారి కోసం కదిలాడు. ప్రభుత్వాలు సైతం చేష్టలుడిగి చూస్తున్నవేళ... సోనూ ఒక్కడే వారికి దారి దీపమయ్యాడు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ దేశం నలుమూలలా ఎక్కడినుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా వారిని ఆదుకునేందుకు శాయాశక్తులా కృషి చేస్తున్నాడు. అందుకే జనం సోనూ సూద్‌కి తమ గుండెల్లో గుడి కట్టారు. ఈ రియల్ హీరోని కలిసేందుకు తాజాగా ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు.

రియల్ హీరో సోను సూద్ మరో కీలక నిర్ణయం... ఆక్సిజన్ కాన్సంట్రేటర్ డోర్ డెలివరీ... అందుబాటులోకి హెల్ప్ లైన్రియల్ హీరో సోను సూద్ మరో కీలక నిర్ణయం... ఆక్సిజన్ కాన్సంట్రేటర్ డోర్ డెలివరీ... అందుబాటులోకి హెల్ప్ లైన్

హైదరాబాద్-ముంబై.. 700కి.మీ పాదయాత్ర

హైదరాబాద్-ముంబై.. 700కి.మీ పాదయాత్ర

తెలంగాణలోని వికారాబాద్‌కి చెందిన వెంకటేశ్ అనే యువకుడు సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను చూసి అతనికి అభిమానిగా మారిపోయాడు. ఎలాగైనా సరే సోనూ సూద్‌ని కలవాలనుకున్నాడు. సోనూ కోసం ఏకంగా ముంబైకి పాదయాత్ర మొదలుపెట్టాడు. చేతిలో సోనూ సూద్ ఫోటోతో ఉన్న ప్లకార్డు పట్టుకుని... కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే కాలినడకన ముంబై బయలుదేరాడు. అలా 700కి.మీ దూరం నడిచి ఎట్టకేలకు ముంబైలోని సోనూ నివాసానికి చేరుకున్నాడు.

సోనూ సూద్ రియాక్షన్...

సోనూ సూద్ రియాక్షన్...

తనను కలిసేందుకు వచ్చిన అభిమాని వెంకటేశ్‌ను సోనూ సూద్ సాదరంగా తన నివాసంలోకి ఆహ్వానించాడు. అతని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వెంకటేశ్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 'వెంకటేశ్ నన్ను కలిసేందుకు కాలినడకన హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాడు. నిజానికి వెంకటేశ్ కోసం ఏదైనా ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ.. అతను మాత్రం కాలినకడనే వచ్చాడు. వెంకటేశ్ స్పూర్తి నన్ను గర్వపడేలా చేస్తోంది. అయితే ఇలాంటి సాహసాలను నేను ప్రోత్సహించి అభిమానులను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.' అని సోనూ సూద్ స్పష్టం చేశాడు.

సోనూని కొనిడియాడుతున్న జనం

దేశవ్యాప్తంగా ఎన్నో వ్యవస్థలు,ప్రభుత్వాలు,వేలాది మంది సెలబ్రిటీలు... ఇందులో సోనూ ఒక్కడే పేదల కష్టానికి అమితంగా చలించాడు. ఆఖరికి ఇండియన్ ఆర్మీ కూడా సోనూని సాయం కోరిందంటే... అతనంటే ఎంత భరోసా,నమ్మకం కలిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం 400 మంది నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ అవసరమొచ్చినా సోనూ సూద్ సాయం అందిస్తున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు,మందులు,ఆస్పత్రులు బెడ్లు... ఇలా ఏ సాయం కోరినా కాదనకుండా ఆదుకుంటున్నాడు. అందుకే సోనూ సూద్‌ను ప్రజలు రియల్ హీరో అని,పేదల పాలిట దేవుడని కొనియాడుతున్నారు.

English summary
Sonu Sood shared a picture with a fan who reportedly walked barefoot from Hyderabad to Mumbai, covering a distance of 700 km, to meet him. The fan, named Venkatesh, did it despite efforts by the actor to arrange transportation for him, wrote Sonu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X