వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మార్పు అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపు.. మాపు.. అంటూ ప్రచారమే తప్ప ఇప్పటికైతే హైకమాండ్ నుంచి దీనిపై ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో అసలు టీపీసీసీ చీఫ్ మార్పు ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పారు. హుజూర్‌నగర్‌లో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.

 ఉత్తమ్ ఏమన్నారు..?

ఉత్తమ్ ఏమన్నారు..?

పీసీసీ పదవి కారణంగా సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నానని ఉత్తమ్ అన్నారు. అయితే భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని, రాజీనామా తర్వాత హుజూర్‌నగర్,కోదాడ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో

కార్యకర్తలతో సమావేశంతో సందర్భంగా ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఉత్తమ్ వ్యాఖ్యలపై చర్చ:

ఉత్తమ్ వ్యాఖ్యలపై చర్చ:

పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటానన్న ఉత్తమ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. త్వరలోనే తప్పుకుంటానంటూ ఉత్తమ్ చెప్పారంటే.. దీనిపై హైకమాండ్‌కు

ఆయన సమాచారం ఇచ్చే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ స్వతహాగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..? లేక హైకమాండ్ ఆ సంకేతాలు పంపడంతో.. ఏ క్షణమైనా పదవి నుంచి
తప్పుకునేందుకు ప్రిపేర్ అయి ఉన్నారా? అన్న చర్చ జరుగుతోంది.

 తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు?

తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు?

ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటే తదుపరి ఆ స్థానాన్ని భర్తీ చేయబోయేది ఎవరన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపేరే ముందు వరుసలో ఉన్నా.. పార్టీలో సీనియర్లే ఆయనకు అడ్డు తగులుతున్నారన్నది అందరికీ తెలిసిందే. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ,వీహెచ్ తదితరులు

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఉంది. సీనియర్ల ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌ పదవికి దూరం పెట్టిందన్న వాదన పార్టీలోనూ
అంతర్గతంగా వినిపిస్తూనే ఉంది.

 సీనియర్ నేతల కొత్త వ్యూహం :

సీనియర్ నేతల కొత్త వ్యూహం :

ఇటీవల సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్,బలరాంనాయక్,సిరిసిల్ల రాజయ్య తదితర నేతలు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడినవారికే టీపీసీసీ చీఫ్ పదవిఇవ్వాలని కోరారు. తద్వారా రేవంత్ ఆశలపై వారు నీళ్లు చల్లే ప్రయత్నం చేశారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ టీడీపీలో ఉండగా.. ఆ పార్టీ అధినేతచంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం సర్వత్రా విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో రేవంత్‌కు ఆ పదవి దక్కకుండా చేసేందుకు ఇలాంటి కొత్త వాదనను తెర పైకి తెచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది.ఏదేమైనా ఒకవేళ ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తే.. హైకమాండ్ ఆ స్తానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందన్నది వేచి చూడాలి.

English summary
TPCC Chief Uttham Kumar Reddy said soon he will resign to his post and spend more time in Huzurnagar. In a party cadre meeting in Huzurnagar,Uttham reveals this matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X