విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6వేల కోట్లు: ఏపీ-తెలంగాణల్లో వేటికి ఎన్ని నిధులు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈ కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొత్త ప్రతిపాదనలు ఏవీ లేవు. దక్షిణ మధ్య రైల్వేకు 5,924 కోట్ల నిధులు కేటాయించారు.

 కేటాయింపులు ఇలా

కేటాయింపులు ఇలా

గత ఏడాదితో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధులపై అడిషనల్ మేనేజర్ జాన్ థామస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం...
అక్కన్నపేట- మెదక్, కొత్తపల్లి- మనోహరాబాద్ మార్గాలకు నిధులు కేటాయించారు. రైల్వే

క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ 1 లక్ష 46వేల 500 కోట్లు అని చెప్పారు. 5,924 కోట్లు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారన్నారు. రూ.834 కోట్లు కొత్త లైన్లకు
, రూ.1,905 డబ్లింగ్ కోసం, రూ.
138 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీల కోసం, రూ.229 మౌళిక వసతులు కోసం కేటాయించారు.

తెలంగాణలో వీటి కోసం

తెలంగాణలో వీటి కోసం

- అక్కన్నపేట్ - మెదక్ లైన్ కోసం రూ.10 కోట్లు

-
ఓబులవారిపల్లి - క్రిష్ణపట్నం కొత్తలైను కోసం రూ. 30కోట్లు అలాగే మిగులు ఉన్న 93 కిలో మీటర్ల దూరాన్ని ఈ ఏడాది పూర్తి చేస్తామని చెప్పారు.
-

ముద్‌ఖేడ్ - పర్బాని ప్రాజెక్టుకు రూ.34.5కోట్లు

-
ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం రూ.10లక్షలు. తెల్లాపూర్ - రామచంద్రాపురం మధ్య 5 కి.మీ., మౌలాలి-ఘట్‌కేసర్ మధ్య 12.2 కి.మీ. లైన్లు పూర్తయ్యాయినట్లు చెప్పారు.

-

మనోహరాబాద్- కొత్త పల్లి మధ్య 150 కిమీ కొత్త లైన్ కోసం రూ.200 కోట్లు

-
మునీరాబాద్ - మహబూబ్‌నగర్‌ల మధ్య 246 కి.మీ. రైల్వే లైను కోసం రూ.275 కోట్లు
-

భద్రాచలం-సత్తుపల్లి మధ్య 56 కి.మీ. కొత్తలైన్ కోసం రూ.405కోట్లు

-
కాజీపేట -బల్లార్ష మధ్య 202 కి.మీ. థర్డ్ లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.265 కోట్లు
-
సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య 85కిమీ మేర చేపడుతున్న డబ్లింగ్ కోసం రూ.200 కోట్లు
-
ఘట్‌కేసర్ - యాదాద్రి ఎంఎంటీఎస్ కోసం రూ.20 కోట్లు
-

బైపాస్ లైన్ల కోసం రూ.143 కోట్లు
-

చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు

 ఏపీలో వీటి కోసం

ఏపీలో వీటి కోసం

గుంటూరు -తెనాలి మధ్య ఎలక్ట్రిఫికేషన్ కోసం రూ.5 కోట్లు

-

నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ. కొత్త లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.700 కోట్లు
-

కడప - బెంగుళూరు మధ్య 225 కి.మీ. దూరానికి కొత్త లైన్ నిర్మాణానికి రూ.210 కోట్లు
-

గుంతకల్ - కల్లూరు మధ్య 40.60 కి.మీ. మేర నిర్మిస్తున్న డబుల్ లైన్ కోసం రూ.15 కోట్లు
-

గుంటూరు - గుంతకల్ మధ్య 443 కి.మీ. మేర నిర్మిస్తున్న డబ్లింగ్ లైన్ కోసం రూ.280 కోట్లు

-
విజయవాడ - భీమవరం - నిడదవోలు మధ్య 221 కి.మీ. మేర నిర్మిస్తున్న డబ్లింగ్ కోసం రూ.175 కోట్లు
-

కొత్తపల్లి - నర్సాపూర్ మధ్య 57 కిమీ మేర నిర్మిస్తున్న కొత్తలైన్ కోసం రూ.200 కోట్లు

-
గుత్తి - ధర్మవరం మధ్య 90 కిమీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ.126 కోట్లు

-
కాజీపేట - విజయవాడ మధ్య 219 కిమీ డబ్లింగ్ పనుల కోసం రూ.110 కోట్లు
-

విజయవాడ - గుంటూరు మధ్య 287 కిమీ మూడో లైన్ నిర్మాణానికి రూ.350 కోట్లు

English summary
South Central Railways gets RS.5,924 crores in budget. Finance minister Piyush Goyal Friday announced a capital expenditure allocation of Rs 1.58 lakh crore for the railway , the highest ever for the national transporter, in an effort to put its flagging revenues back on track.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X